Let's talk: editor@tmv.in
విశాఖ పోలీసులకు ఏడు కుక్కలు

విశాఖ పోలీసులకు ఏడు కుక్కలు

FL - YUGDR
16 సెప్టెంబర్, 2025

తొలిపలుకు, విశాఖపట్నం;* నగర పోలీస్ కమిషనరేట్ డాగ్ స్క్వాడ్ కు మరో ఏడు డాగ్స్ వచ్చాయి . ఇవి గాంజా డిటెక్టర్ లో ప్రత్యేక శిక్షణ పొందాయని నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత భాగ్చి, అన్నారు. వీటి కోసం ప్రత్యేక కెనాల్ 18 లక్షలు తో జీవీఎంసీ సమకూర్చిందని , రాష్ట్రంలో మరి ఎక్కడా లేనివిధంగా నగరానికి 10 ప్రత్యేక నార్కోటెక్ లో శిక్షణ పొందిన డాగ్స్ ఉండడం గర్వకారణమని పేర్కొన్నారు. ఇవి గంజానిర్మూలించుటకుతోడ్పడతాయని, డ్రగ్స్ తర్ఫీదులో ప్రధమ బహుమతి పొందిన విశాఖపట్నం చెందిన లైకాకు రావడం గర్వకారణం అని అన్నారు. గోల్డ్ మెడల్ ను సోమవారం మేయర్ పేలా శ్రీనివాసరావు చేతుల మీదుగా లైకాకు బహుకరించారు. కొత్తగా శిక్షణ పొందిన ఎనిమిది డాగ్స్ లో ఐదు డాగ్స్ జిల్లా కలెక్టర్ స్పాన్సర్ చేశారని, మరో మూడు డాగ్స్ తో పాటు నూతనంగా నిర్మించిన కెనాల్ జీవీఎంసీ స్పాన్సర్ చేసిందని అన్నారు.

విశాఖ పోలీసులకు ఏడు కుక్కలు - Tholi Paluku