
విశాఖలో ఉత్సాహంగా ‘స్వచ్చోత్సవ్’
స్వచ్చోత్సవ్‌లో భాగంగా పండిట్ దీన దయాళ్ ఉపాధ్యాయ జయంతిని పురష్కరించుకుని ఏక్ దిన్.. ఏక్ గంట.. ఏక్ సాథ్ పేరుతో గురువారం నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు జిల్లాలో ఉత్సాహంగా సాగాయి. ఆయా విభాగాల అధికారులు స్వచ్ఛ కార్యక్రమాలు చేపట్టారు. పరిసరాలను శుభ్రం చేసుకున్నారు. చెత్తాచెదారం తొలగించారు. ప్రాంగణాల్లో మొక్కలు నాటారు. తడిచెత్త, పొడిచెత్త వేరే చేసి డస్ట్ బిన్లలో వేసి తరలించారు. ఈ క్రమంలో కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్వహించిన స్వచ్ఛాతా హీ సేవా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ భాగస్వామ్యమయ్యారు. పరిసరాలను శుభ్రపరిచారు. చెత్తాచెదారం, పిచ్చి మొక్కలను తొలగించారు. డీఆర్వో భవానీ శంకర్, కలెక్టరేట్ ఏవో, ఇతర విభాగాల సూపరింటెండెంట్లు, ఇతర ఉద్యోగులు కార్యక్రమంలో పాల్గొని పరిశుభ్రతా చర్యలు చేపట్టారు.
