Let's talk: editor@tmv.in
వరల్డ్ నెం.1 బ్యాటర్గా స్మృతి మంధాన

వరల్డ్ నెం.1 బ్యాటర్గా స్మృతి మంధాన

Shaik Mohammad Shaffee
17 సెప్టెంబర్, 2025

ప్రపంచకప్ ప్రారంభానికి రెండు వారాల ముందు ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. తాజా ర్యాంకింగ్స్లో భారత స్టార్ బ్యాటర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన మళ్లీ నంబర్ 1 స్థానానికిచేరుకున్నారు. ఇంగ్లాండ్ కెప్టెన్ నాట్ స్కివర్-బ్రంట్ను వెనక్కి నెట్టి మంధాన ఈ ఘనత సాధించారు. న్యూ చండీగఢ్లో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో మంధాన 58 పరుగుల అర్ధ సెంచరీ సాధించారు. ఈ ప్రదర్శనతో ఆమె ఏడు రేటింగ్ పాయింట్లు సంపాదించి, స్కివర్-బ్రంట్పై నాలుగు పాయింట్ల ఆధిక్యంతో అగ్రస్థానానికి దూసుకెళ్లారు. ఈ ఏడాది జూన్, జూలై నెలల్లో కూడా మంధాన నంబర్ 1 స్థానంలో కొనసాగారు. 2019లోనూ ఆమె ఈ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం.

ఐసీసీ మహిళల ప్రపంచకప్ 13వ ఎడిషన్ ప్రారంభానికి సరిగ్గా పదిహేను రోజుల ముందు మంధాన ఈ అద్భుతమైన ఫామ్ను కొనసాగించడం భారత జట్టుకు శుభపరిణామం. మంధానతో పాటు మరి కొందరు భారత మహిళా క్రికెటర్లు కూడా ర్యాంకింగ్స్లో మెరుగుపడ్డారు. రిచా ఘోష్ మూడు స్థానాలు మెరుగుపడి 36వ స్థానానికి, ప్రతికా రావల్ నాలుగు స్థానాలు మెరుగుపడి 42వ స్థానానికి, హర్లీన్ డియోల్ ఐదు స్థానాలు మెరుగుపడి 43వ స్థానానికి చేరుకున్నారు.

మరోవైపు ఆసీస్ బ్యాటర్ బెత్ మూనీ మూడు స్థానాలు ఎగబాకి ఐదో స్థానానికి చేరుకున్నారు. అలాగే అన్నాబెల్ సదర్లాండ్ నాలుగు స్థానాలు, ఫోబ్ లిచ్ఫీల్డ్ 13 స్థానాలు మెరుగుపడి 25వ స్థానాన్ని పంచుకున్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఫాస్ట్ బౌలర్ కిమ్ గార్త్ ఒక స్థానం మెరుగుపడి నాలుగో స్థానానికి, స్పిన్నర్ అలానా కింగ్ ఒక స్థానం మెరుగుపడి ఐదో స్థానానికి చేరుకుని తమ కెరీర్ బెస్ట్ రేటింగ్లను సాధించారు. ఆస్ట్రేలియాకు చెందిన యాష్ గార్డ్నర్ నంబర్ 1 ఆల్రౌండర్గా తన స్థానాన్ని నిలుపుకోగా, ఆమె సహచర ఆటగాళ్లు అన్నాబెల్ సదర్లాండ్ ఒక స్థానం మెరుగుపడి ఆరో స్థానానికి, ఎల్లీస్ పెర్రీ రెండు స్థానాలు మెరుగుపడి 13వ స్థానానికి చేరుకున్నారు. బౌలింగ్ ర్యాంకింగ్స్లో భారత స్పిన్నర్ స్నేహ్ రాణా ఐదు స్థానాలు మెరుగుపడి 13వ స్థానానికి చేరుకోగా, ఇంగ్లాండ్ స్పిన్నర్ సోఫీ ఎక్లెస్టోన్ గత వారం ఆడకపోయినా నంబర్ 1 బౌలర్గా తన స్థానాన్ని నిలుపుకున్నారు.

వరల్డ్ నెం.1 బ్యాటర్గా స్మృతి మంధాన - Tholi Paluku