
విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం
FL - YUGDR
19 సెప్టెంబర్, 2025
ఎక్కడో ఓ చోట విమాన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. విమానాల్లో సాంకేతిక లోపాల కారణంగా, తదితర కారణాల వల్ల నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా విశాఖపట్నం విమానాశ్రయంలో విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. గురువారం మధ్యాహ్నం విశాఖపట్నం నుంచి 2 .20 నిమిషాలకి హైదరాబాద్ బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కొంత దూరం వెళ్ళాక విమాన రెక్కల్లోకి పక్షి ఇరుక్కోవడం వల్ల ఫ్యాన్ రెక్కలు డ్యామేజ్ అయ్యాయి . పైలెట్ చాకచక్యంగా వెనక్కి తీసుకొచ్చి ల్యాండ్ చేసి ఇండియా ఎక్స్ప్రెస్ పైలెట్ ప్రయాణీకులను రక్షించారు.ఈ విమానంలో 103 మంది ప్రయాణికులు సురక్షితంగా విశాఖపట్నంలో దిగారు.103 ప్రయాణికులకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ యాజమాన్యం వారి గమ్యస్థానాలకు వెళ్లేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసింది..
