Let's talk: editor@tmv.in
వన్డే క్రికెట్‌లోకి డికాక్ పునరాగమనం

వన్డే క్రికెట్‌లోకి డికాక్ పునరాగమనం

Shaik Mohammad Shaffee
23 సెప్టెంబర్, 2025

దక్షిణాఫ్రికా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్ తన అభిమానులకు శుభవార్త అందించాడు. రెండేళ్ల క్రితం వన్డే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఆయన, ఇప్పుడు తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని మళ్లీ జట్టులోకి అడుగుపెట్టాడు. త్వరలో జరగనున్న పాకిస్థాన్ పర్యటన కోసం ప్రకటించిన వన్డే, టీ20 జట్లలోనూ డికాక్‌కు చోటు దక్కడం గమనార్హం.

క్వింటన్ డికాక్ 2023లో జరిగిన వన్డే ప్రపంచకప్ తర్వాత 50 ఓవర్ల ఫార్మాట్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన కేవలం టీ20 క్రికెట్ మాత్రమే ఆడుతున్నాడు. అయితే 2027లో తమ స్వదేశంలో జరగనున్న వన్డే వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకుని డికాక్ తన మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. పాక్ టూర్‌కు ముందు నమీబియాతో జరిగే ఏకైక టీ20 మ్యాచ్‌లో కూడా డికాక్ ఆడనున్నాడు.

డికాక్ పునరాగమనంపై దక్షిణాఫ్రికా ప్రధాన కోచ్ షుక్రీ కాన్రాడ్ హర్షం వ్యక్తం చేశారు. ‘’వైట్-బాల్ క్రికెట్‌లోకి క్వింటన్ తిరిగి రావడం మాకు చాలా పెద్ద బూస్ట్. అతడి భవిష్యత్తు ప్రణాళికల గురించి మేము గత నెలలో చర్చించాం. దేశం తరఫున ఆడాలనే బలమైన ఆకాంక్ష అతడిలో ఇంకా ఉందని స్పష్టమైంది. అతడి అనుభవం, నైపుణ్యం జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుంది’’ అని కాన్రాడ్ వివరించారు.

డికాక్ ఇప్పటివరకు 155 వన్డేలలో దక్షిణాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించాడు. 45.74 సగటుతో 96.64 స్ట్రైక్ రేట్‌తో 6,770 పరుగులు సాధించాడు. ఇందులో 21 సెంచరీలు ఉన్నాయి. అదేవిధంగా 92 టీ20 మ్యాచ్‌లలో 138.32 స్ట్రైక్ రేట్‌తో 2,584 పరుగులు చేశాడు. అతడి అనుభవం, దూకుడైన బ్యాటింగ్ రాబోయే టోర్నీల్లో జట్టుకు చాలా కీలకం కానున్నాయి.

టెస్ట్ సిరీస్‌కు బవుమా దూరం

ఇదిలా ఉండగా ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనలో గాయపడిన టెస్ట్ కెప్టెన్ తెంబా బవుమా, పిక్కల్లో గాయం నుండి ఇంకా కోలుకోకపోవడంతో పాకిస్థాన్‌తో టెస్ట్ సిరీస్‌కు దూరమయ్యారు. బవుమా లేకపోవడంతో ఐడెన్ మార్క్రామ్ దక్షిణాఫ్రికాకు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు.

టెస్ట్ జట్టు: ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), డేవిడ్ బెడింగ్‌హామ్, కార్బిన్ బోష్, డెవాల్డ్ బ్రెవిస్, టోనీ డి జోర్జి, జుబాయర్ హమ్జా, సైమన్ హార్మర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్ (రెండో టెస్ట్ మాత్రమే), వియాన్ ముల్డర్, సెనురాన్ ముత్తుసామి, కగిసో రబాడా, రియాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, ప్రిన్‌లాన్ సుబ్రాయేన్, కైల్ వెర్రేయిన్

టీ20 జట్టు: డేవిడ్ మిల్లర్ (కెప్టెన్), కార్బిన్ బోష్, డెవాల్డ్ బ్రెవిస్, నాండ్రే బర్గర్, గెరాల్డ్ కోయెట్జీ, క్వింటన్ డి కాక్, డోనోవన్ ఫెరీరా, రీజా హెండ్రిక్స్, జార్జ్ లిండే, క్వేనా మఫాకా, లుంగీ ఎంగిడి, ఎన్కాబా పీటర్, లువాన్-డ్రే ప్రిటోరియస్, ఆండిలే సిమేలనే, లిజాద్ విలియమ్స్

వన్డే జట్టు: మాథ్యూ బ్రీట్జ్కే (కెప్టెన్), కార్బిన్ బోష్, డెవాల్డ్ బ్రెవిస్, నాండ్రే బర్గర్, గెరాల్డ్ కోయెట్జీ, క్వింటన్ డికాక్, టోనీ డి జోర్జి, డోనోవన్ ఫెరీరా, బ్యోర్న్ ఫార్టూయిన్, జార్జ్ లిండే, క్వేనా మఫాకా, లుంగీ ఎంగిడి, ఎన్కాబా పీటర్, లువాన్-డ్రే ప్రిటోరియస్, సినెథెంబ ఖేషిలే

నమీబియాతో టీ20కి సౌతాఫ్రికా జట్టు: డోనోవన్ ఫెరీరా (కెప్టెన్), నాండ్రే బర్గర్, గెరాల్డ్ కోయెట్జీ, క్వింటన్ డికాక్, బ్యోర్న్ ఫార్టూయిన్, రీజా హెండ్రిక్స్, రూబిన్ హెర్మన్, క్వేనా మఫాకా, రివాల్డో మూన్‌సామి, ఎన్కాబా పీటర్, లువాన్-డ్రే ప్రిటోరియస్, ఆండిలే సిమేలనే, జాసన్ స్మిత్, లిజాద్ విలియమ్స్.

వన్డే క్రికెట్‌లోకి డికాక్ పునరాగమనం - Tholi Paluku