Let's talk: editor@tmv.in
విద్వేష రాజకీయాలకు ఇదే సాక్ష్యం

విద్వేష రాజకీయాలకు ఇదే సాక్ష్యం

Pinjari Chand
18 సెప్టెంబర్, 2025

తొలిపలుకు, అస్సాం* రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ ఇప్పటి నుంచే మత విద్వేషాలు రెచ్చగొడుతుంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలవకపోతే మొత్తం రాష్ట్రం ముస్లిం పరం అవుతుందన్నట్లు తెలిపే ఓ ఏఐ వీడియోను బీజేపీ అస్సాం అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ లో విడుదల చేసింది. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగుతోంది. దీనిపై ఎంఐఎం అధినేత ఓవైసీ బీజేపీ చేస్తున్న మత రాజకీయాలపై విరుచుకుపడ్డారు. కేవలం ఇది ఓట్ల కోసం చేస్తున్న దుష్ర్పచారం అని , హిందూ సోదరుల ఓట్లను భయపెట్టి పొందుదామనే దురుద్దేశంతోనే ఇలాంటి వీడియోలు విడుదల చేసిందని, బీజేపీ చెబుతున్న అసలైన హిందూత్వ భావజాలమిదేనని ఆయన విమర్శించారు.

ముస్లింలపై ఏడవడమే బీజేపీ రాజకీయం. వారు దేశ అభివృద్ధి గురించి మాట్లాడారు. దేశంలో ముస్లింలు ఉండడమే వారికి సమస్య. ముస్లిం ముక్త్ భారత్ వారి కల.ముస్లింలపై నిరంతర విమర్శలు చేసి ఎన్నికల్లో లబ్ధి పొందడమే వారి పని అంటూ ఇలాంటి విద్వేషాలను రెచ్చగొట్టే వీడియోలను ఖండించాలని కోరారు. పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. 2026 లో జరిగే ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ ఇలాంటి ద్వేషపూరిత వీడియోను విడుదల చేసిందని, ఇండియాలో అసలేం జరుగుతోంది. ఎవరూ అడ్డు చెప్పే వారే లేరా అంటూ బాలీవుడ్ నటి శ్రేయధన్వంతరి ప్రశ్నించింది. అయితే బీజేపీ చేసిన ఇస్లామోఫోబియా పోస్ట్ పై అనేక మంది ప్రముఖులు స్పందిస్తూ పోస్టులు పెడుతున్నారు. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా ఏఐ వీడియోలు పెట్టడం మంచి సంస్క`తి కాదని, ద్వేషపూరితంగా ఉండే ఇలాంటి వీడియోలు ఎవరూ పెట్టిన క్షమించరానిదాని వ్యాఖ్యానిస్తున్నారు.

విద్వేష రాజకీయాలకు ఇదే సాక్ష్యం - Tholi Paluku