Let's talk: editor@tmv.in
విద్యార్థుల మధ్య ఘర్షణ: కళ్ళలో ఫెవిక్విక్ పోసి దాడి

విద్యార్థుల మధ్య ఘర్షణ: కళ్ళలో ఫెవిక్విక్ పోసి దాడి

Panthagani Anusha
15 సెప్టెంబర్, 2025

ఆకతాయితనంతో చేసే చిన్న తప్పు కొన్నిసార్లు పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది. ఒడిశా రాష్ట్రం కంధమాల్ జిల్లా ఫిరింగియా బ్లాక్లోని సలగూడా సెబాశ్రమ్ విద్యాలయం చెందిన వసతిగృహంలో నిద్రిస్తున్న 8 మంది విద్యార్థుల కళ్లలో తోటి విద్యార్థులు ఫెవిక్విక్ పోసి గాయపరిచారు. ఈ ఘటనలో కొందరి కళ్ళు పూర్తిగా మూసివేయబడిన స్థితి ఏర్పడింది.

విద్యార్థుల కుటుంబాలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులను హాస్పిటల్కు తరలించారు. తొలుత గోఛాపడా ఆసుపత్రిలో చికిత్స పొందిన, పరిస్థితి గందరగోళంగా ఉండటంతో ఫుల్బాని జిల్లా ఆసుపత్రికి తరలించారు. కాగా ప్రస్తుతం ఏడుగురు విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు, ఒకరి పరిస్థితి కుదుటపడంతో డిశ్చార్జ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, ఈ ఘటన హాస్టల్లో రెండు వర్గాల విద్యార్థుల మధ్య సాధారణ గొడవలు జరిగేవని . గొడవ తీవ్రంగా మారిన క్రమంలో, కొందరు విద్యార్థులు తమ వద్ద గొడవ పెట్టుకున్న వారి కళ్లలో ఫెవిక్విక్ పోసి ఈ దారుణానికి పాల్పడినట్టు తేలింది. మరోవైపు జిల్లా అధికారులు సంఘటనపై స్పందించి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మనోరంజన్ సాహు,మరికొంతమంది ఉపాధ్యాయులను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. అయితే, ఘటన సమయంలో ప్రధానోపాధ్యాయుడు పాఠశాలలో లేకపోవడం గమనార్హం. ఇక హాస్టల్ వార్డెన్, సూపరింటెండెంట్ల నిర్లక్ష్యం పట్ల విచారణ జరుపుతున్నట్టు అధికారులు పేర్కొన్నారు.

మరోవైపు వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం,విద్యార్థులకు సమయానికి చికిత్స అందించడంతో ప్రాణాపాయం ప్రమాదం తప్పిందని కానీ బాధితులు కొన్ని రోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి అని సూచించారు. తల్లిదండ్రులు ఈ ఘటనపై తీవ్రమైన విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలో ప్రధానంగా ఆదివాసీ పిల్లలు చదువుతున్నందున భద్రతా లోపాలు స్థానికుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఇక జిల్లా సంక్షేమ అధికారి ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు, జిల్లా కలెక్టర్ స్పందిస్తూ జరిగిన ఘటనపై లోతైన విచారణ జరపాలని ఆదేశాలు జారీచేశారు.

విద్యార్థుల మధ్య ఘర్షణ: కళ్ళలో ఫెవిక్విక్ పోసి దాడి - Tholi Paluku