Let's talk: editor@tmv.in
విద్యుత్ శాఖ ఏడీఈకి 14రోజుల రిమాండ్

విద్యుత్ శాఖ ఏడీఈకి 14రోజుల రిమాండ్

T Venkata Ramana
18 సెప్టెంబర్, 2025

విద్యుత్ శాఖ ఏడీఈ అంబేడ్కర్ అక్రమ సంపాదన ఇంతా అంతా కాదు. ఏసీబీ సోదాల్లో ఆయన ఆస్తులను చూసి విస్తుపోయారు. ఏడీఈ అంబేద్కర్ అక్రమాస్తులు 200 కోట్లకు పైగా ఉన్నట్టు గుర్తించారు. అంబేద్కర్, ఆయన బంధువులకు చెందిన 15ప్రాంతాల్లో సోదాలు చేసి అంబేద్కర్ ను అరెస్టు చేశారు. అంబేద్కర్ బినామీ సతీష్ ఇంట్లో రూ 2.58 కోట్ల రూపాయల నగదు లభ్యం కావడం ఏసీబీ చరిత్రలో ఇంత మొత్తం లో డబ్బు దొరకటం మొదటిసారని తెలిపారు పోలీసులు.

ప్రభుత్వ అధికారిగా ఉంటూ అంబేద్కర్ కెమికల్ ఫ్యాక్టరీని నెలకొల్పాడని రిమాండ్ రిపోర్టులో వివరించారు. పోలీసులు. సూర్యాపేట లో కెమికల్స్ ఫ్యాక్టరీని రెండు సంవత్సరాల క్రితమే ఏర్పాటు చేసి కెమికల్స్ పేరుతో ఇథనాల్ తయారీ చేస్తున్నారు. దీనికి అంబేద్కర్ కంపెనీ డైరెక్టర్ గా ఉన్నారు. అంబేద్కర్ అధిక పనులు బినామీలతోనే చేయించారు. బినామీలకు కాంట్రాక్టులు పనులు ఇప్పించి పని మొత్తం తానే చూసుకున్నాడు. కొన్ని నెలల క్రితమే అంబేద్కర్ పై విజిలెన్స్ విచారణ కూడా జరిగింది.

రిమాండ్

అంబేడ్కర్కు హైదరాబాద్లో ఆరు ప్లాట్లు, గచ్చిబౌలిలో ఐదంతస్తుల భవనం ఉన్నట్లు గుర్తించారు. మరో ఖరీదైన భవనం, వెయ్యి గజాల స్థలం, సూర్యాపేటలో పది ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించారు. అంబేడ్కర్ ఇంట్లో బంగారం, బ్యాంకులో రూ.78 లక్షలు ఉన్నట్లు తెలిపారు. ఈక్రమంలో ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఆయన్ను మంగళవారం అరెస్టు చేశారు. బుధవారం ఉదయం జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు.

కోట్లకు పడగలెత్తిన ఏడీఈ

గతంలో జిహెచ్ఎంసిలో ఏఈగా పనిచేసిన అంబేద్కర్ డిస్కంలో పటాన్ చెరు కేపీహెచ్ బీ , గచ్చిబౌలి లో పనిచేయటంతో అధిక మొత్తంలో అక్రమ ఆస్తులు కూడా అర్జించారని ఆరోపణలు ఉన్నాయి. ఐటీ కారిడార్ లో వైరస్ బిల్డింగ్ లకు విద్యుత్ కనెక్షన్ల జారీ సమయంలో పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. కనెక్షన్ ఇచ్చేందుకు లోడ్ సరిపోదని సాకు చెబుతూ వారి వద్ద నుంచి కోట్లలో లంచం తీసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. పలుమార్లు అంబేద్కర్ పై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి.

వట్టినాగులపల్లిలో వివాదంలో ఉన్న వెంచర్కు కనెక్షన్ ఇవ్వద్దని హైకోర్టు ఆదేశాలు ఉన్న బేఖాతారూ చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయి. మెదక్, నల్లగొండ, రంగారెడ్డి, నిజామాబాద్ సహా హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి, శేరిలింగంపల్లిలో స్వాధీనం చేసుకున్న మొత్తం ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో రూ.200 కోట్లకుపైనే ఉంటుందని ఏసీబీ అంచనా వేసింది. షేర్లలో మరో రూ.36 లక్షల పెట్టుబడులు ఉన్న ట్టు గుర్తించింది. కారులో మరో రూ.5.5 లక్షల నగదు దొరికిందని ఏసీబీ డీఎస్పీ ఆనంద్ తెలిపారు. సోదా లు చేపట్టిన చోట్ల భారీగా అక్రమాస్తుల ఆస్తుల పత్రాలను సైతం స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది.అంబేడ్కర్ను ఏసీబీ అధికారులు నాంపల్లి ఏసీబీ కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచారు. ఆయనకు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో చంచల్గూడ జైలుకు తరలించారు.

విద్యుత్ శాఖ ఏడీఈకి 14రోజుల రిమాండ్ - Tholi Paluku