Let's talk: editor@tmv.in
వంతారాకు సుప్రీంకోర్టులో ఊరట

వంతారాకు సుప్రీంకోర్టులో ఊరట

Pinjari Chand
16 సెప్టెంబర్, 2025

రిలయన్స్ సంస్థ గుజరాత్లోని జాంనగర్ లో చేపట్టిన వంతారా వన్యప్రాణుల సంరక్షణ కేంద్రానికి సుప్రీం కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. వంతారా సంస్థ వన్యప్రాణి చట్టాలను పాటించకుండా వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి ఏనుగులను ఆక్రమంగా తీసుకువస్తున్నారని, అలాగే తీసుకొచ్చిన ఏనుగులను తిరిగి యజమానులకు ఇవ్వడానికి నిరాకరిస్తోందని సుప్రీం కోర్టులో వన్యప్రాణుల సంరక్షణ సంస్థలు, జయసుకిన్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. దీంతో సుప్రీం కోర్టు రిటైర్డ్ జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అధ్యక్షతన నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఆగష్టు 25న వేసింది. ఆ కమిటీ దర్యాప్తు చేసి అక్కడ అంతర్జాతీయ, వన్యప్రాణి చట్టాల ప్రకారమే అన్ని విషయాలు ఉన్నాయంటూ నివేదికను ఇచ్చింది. దీనిపై జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ పీబీ వరాలేలతో కూడిన ధర్మాసనం క్లీన్ చిట్ ను ఇచ్చింది.

ఆధారాలు చూపెట్టండి

ఏనుగుల తరలింపు నిబంధనల ప్రకారమే ఉన్నాయని, మీరన్నట్లు ఏనుగులు బాధపడుతున్నాయంటే అందుకు సంబంధించిన ఆధారాలు పిటిషనర్లు సమర్పించాలి కదా అని తెలిపింది. మీరు మీ వాదనలను స్పష్టంగా, ఆధారాలతో రావాల్సింది అని అభిప్రాయపడింది. వంతారా ప్రాజెక్ట్ దేశ గర్వించే విషయమని, దీన్ని ఆదర్శాలను తక్కువగా చేసి చూడకండి అని పిటిషనర్లను కోరింది. అయితే మొదటినుంచి వంతారా తరపు న్యాయవాది అక్కడ చట్ట విరుద్ధంగా ఏమి జరగట్లేదని వివరిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ సుప్రీం కమిటీని ఏర్పాటు చేసి దర్యాప్తును చేపట్టింది.

వంతారాకు సుప్రీంకోర్టులో ఊరట - Tholi Paluku