
విజయవంతంగా ‘స్వీయ రక్షణ’ కార్యక్రమాలు
బాలికలు తమకు తామే రక్షించుకునేలా జమ్మూలోని రాజౌరీ జిల్లాలో ఆత్మరక్షణ కార్యక్రమాలు చేపట్టామని డిప్యూటీ కమిషనర్ అభిషేక్ శర్మ తెలిపారు. సోమవారం నుంచి బేటీ బచావో, బేటి పడావో’ పథకం కింద విద్యార్థినులకు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశామని తెలిపారు. అయితే సేవాపర్వ్ లో భాగంగా స్వశక్తనారీ, సురక్షిత్ పరివార్ శిక్షణ కార్యక్రమం నేటితో ముగిసిందన్నారు.అయితే ఈ కార్యక్రమాలు సెప్టెంబర్ 17 నుంచి నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమాల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నారని, రాజౌరీ జిల్లాలోనూ ఈ కార్యక్రమ ప్రచారానికి 75 మంది బాలికలను ఎంపిక చేశారు.
ఈ బృందం ఎంపిక చేసిన ఆయా గ్రామాల్లో పర్యటించి మహిళల ఆరోగ్య సంరక్షణపై , పోషకాహారంపై సలహాలిచ్చాయి. అవసరమైన చోట వైద్య శిబిరాలు నిర్వహించామన్నారు. క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ పథకాల గురించి ప్రచారం చేయడానికి, పథకాల పై వారికున్న అవగాహనను అర్థం చేసుకోవడానికి ఈ కార్యక్రమాలు ఉపయోగపడ్డాయి. ‘ఆదికర్మయోగి’ కార్యక్రమంలో లైన్ ఆఫ్ కంట్రోల్ వెంట ఉన్న గ్రామాలను సందర్శించామన్నారు. అయితే ఈ పర్యటనలో అక్కడి స్థానికులు కొన్ని సమస్యలను ముందుకు తెచ్చారన్నారు. ప్రధానంగా వారు తమకు ఓ పశుసంరక్షణ కేంద్రాన్ని, సరైన రోడ్లను ఏర్పాటు చేయాలని కోరినట్లు వివరించారు. చివరగా మహిళా పీజీ కాలేజీలో ఐదు రోజుల పాటు విద్యార్థులకు స్వీయ రక్షణ పై శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
