
విజయవాడ వచ్చిన ఉపరాష్ట్రపతి సీపి రాధాకృష్ణన్
Gangadhar Veerla
25 సెప్టెంబర్, 2025
దసరా ఉత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు తొలిసారిగా విజయవాడకు చేరుకున్న భారత ఉపరాష్ట్రపతి సీ.పి. రాధాకృష్ణన్‌కు ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు దంపతులు విమానాశ్రయంలో హృదయపూర్వక స్వాగతం పలికారు. గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, మంత్రులు, పోలీస్ అధికారులు ఉపరాష్ట్రపతిని ఆహ్వానించిన వారిలో ఉన్నారు.
సీ.పి. రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని ఈ పవిత్ర ఉత్సవాల్లో పాల్గొనడం విశేషం. ఇది ఉపరాష్ట్రపతి అధికారికంగా మొదటి దక్షిణ భారత పర్యటన. ఉపరాష్ట్రపతి దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడలో రెండు రోజులు ఉండి, దసరా శోభా యాత్రలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని, తిరుపతి వెళ్లనున్నారు.
