Let's talk: editor@tmv.in
లోక్‌సభలో 64 పార్లమెంటరీ ఫ్రెండ్‌షిప్ గ్రూపులు ఏర్పాటు

లోక్‌సభలో 64 పార్లమెంటరీ ఫ్రెండ్‌షిప్ గ్రూపులు ఏర్పాటు

Pinjari Chand
25 ఫిబ్రవరి, 2026

ప్రపంచ దేశాలతో భారత శాసన సంబంధాలను బలోపేతం చేయడానికి లోక్‌సభలో 64 పార్లమెంటరీ ఫ్రెండ్‌షిప్ గ్రూపులు (పీఎఫ్ జీస్) ఏర్పాటు చేసినట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు తెలిపారు. సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచనతో ఈ గ్రూపుల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ గ్రూపులను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అధికారికంగా ఏర్పాటు చేశారు.

18వ లోక్‌సభలో ప్రత్యేక గ్రూపులు

18వ లోక్‌సభ కింద ఏర్పడిన ఈ గ్రూపుల్లో రెండు సభల సభ్యులు ఉంటారు. ప్రతి దేశానికి ఒక గ్రూప్ లీడర్‌ను నియమించారు.

ముఖ్య నియామకాలు

అమెరికా – బైజయంత్ పాండా (బీజేపీ)

రష్యా – నిశికాంత్ దూబే (బీజేపీ)

ఫ్రాన్స్ – శశి థరూర్ (ఐఎన్సీ)

జపాన్ – అఖిలేశ్ యాదవ్ (ఎస్పీ)

ఇటలీ – పి. చిదంబరం (ఐఎన్సీ)

ఆస్ట్రేలియా – మనీష్ తివారి (ఐఎన్సీ)

ఒమన్ – అసదుద్దీన్ ఓవైసీ (ఏఐఎంఐఎం)

మలేసియా – టి.ఆర్. బాలు (డీఎంకే)

సింగపూర్ – సుప్రియా సూలే (ఎన్సీపీ-ఎస్పీ)

ఇండోనేషియా – శ్రీకాంత్ ఏక్‌నాథ్ షిండే (శివసేన)

బ్రెజిల్ – ప్రఫుల్ పటేల్ (ఎన్సీపీ)

కెన్యా – ప్రేమ్ చంద్ గుప్తా (ఆర్జేడీ)

యూకే – రవి శంకర్ ప్రసాద్ (బీజేపీ)

ఇజ్రాయెల్ – భర్తృహరి మహతాబ్ (బీజేపీ)

సౌదీ అరేబియా – సుధాన్షు త్రివేది బీజేపీ)

మాల్దీవులు – లావు శ్రీకృష్ణ దేవరాయలు (టీడీపీ)

నేపాల్ – నీరజ్ శేఖర్ (బీజేపీ)

అల్జీరియా – అభిషేక్ బెనర్జీ (ఏఐటీసీ)

గ్రీస్ – కనిమొళి కరుణానిధి (డీఎంకే)

క్యూబా – మాగుంట శ్రీనివాసులు రెడ్డి (టీడీపీ)

యూఏఈ – సంజయ్ జైస్వాల్ (బీజేపీ)

వియత్నాం – విష్ణు దయాళ్ రామ్ (బీజేపీ)

మెక్సికో – ప్రమోద్ తివారి (ఐఎన్సీ)

ఇరాన్ – దేవేష్ చంద్ర ఠాకూర్ (జేడీయూ)

ఇవే కాకుండా శ్రీలంక, జర్మనీ, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్, అర్జెంటీనా, దక్షిణాఫ్రికా, భూటాన్, ఈయూ పార్లమెంట్ (బ్రస్సెల్స్), దక్షిణ కొరియా, పోలాండ్, ఐర్లాండ్, ఆస్ట్రియా, ఫిలిప్పీన్స్, టాంజానియా, ఈజిప్ట్, పోర్చుగల్, జార్జియా, మొరాకో, సురినామ్, బాల్టిక్ దేశాలు, ఉక్రెయిన్ తదితర దేశాలకు కూడా గ్రూప్ లీడర్లను నియమించారు.

లక్ష్యం

ఈ ఫ్రెండ్‌షిప్ గ్రూపుల ద్వారా ద్వైపాక్షిక శాసన సంబంధాల బలోపేతం, ప్రజాస్వామ్య అనుభవాల మార్పిడి, వాణిజ్యం, రక్షణ, సాంస్కృతిక రంగాల్లో సహకారం పెంపు, పార్లమెంటరీ డిప్లమసీకి కొత్త ఊపు తీసుకురావడం. ప్రపంచ దేశాలతో ప్రజాస్వామ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.