Let's talk: editor@tmv.in
లోక్‌సభలో 'సెక్యూరిటీస్ మార్కెట్స్ కోడ్ బిల్లు' ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్

లోక్‌సభలో 'సెక్యూరిటీస్ మార్కెట్స్ కోడ్ బిల్లు' ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్

Dantu Vijaya Lakshmi Prasanna
19 డిసెంబర్, 2025

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోక్‌సభలో సెక్యూరిటీస్ మార్కెట్స్ కోడ్ బిల్లు, 2025 ను ప్రవేశపెట్టారు. ఈ బిల్లును తదుపరి పరిశీలన కోసం పార్లమెంటరీ ఆర్థిక స్టాండింగ్ కమిటీకి పంపాలని ఆమె ప్రతిపాదించారు.

బిల్లు లో ముఖ్య అంశాలు:

భారతదేశ సెక్యూరిటీల మార్కెట్ చట్టాలను సరళీకరించడం, క్రమబద్ధీకరించడం ఈ బిల్లు ప్రధాన లక్ష్యం. అనగా ఏకీకృత చట్టం అమలు చేస్తారు. గతంలో విడివిడిగా ఉన్న నాలుగు ప్రధాన చట్టాలను కలిపి ఒకే గొడుగు కిందికి తీసుకురానున్నారు

సెబీ (SEBI) చట్టం, 1992

డిపాజిటరీల చట్టం, 1996

సెక్యూరిటీల ఒప్పందాల (నియంత్రణ) చట్టం, 1956

ప్రభుత్వ సెక్యూరిటీల చట్టం, 2007

2021-22 కేంద్ర బడ్జెట్ ప్రసంగంలోనే ఈ చట్టాల విలీనం గురించి ఆర్థిక మంత్రి తొలిసారిగా ప్రకటించారు.

దీనివల్ల కలిగే ప్రయోజనాలు:

వివిధ చట్టాల మధ్య ఉన్న వైరుధ్యాలను తొలగించి, మార్కెట్ నియంత్రణలో మరింత స్పష్టతను తీసుకువస్తుంది. సులభతర వాణిజ్యం జరుగి మార్కెట్ భాగస్వాములకు నిబంధనల అమలు సులభతరం అవుతుంది. పారదర్శకత పెరగడం ద్వారా పెట్టుబడిదారులలో నమ్మకం పెరుగుతుంది. ఆర్థిక మార్కెట్లు మరింత మెరుగ్గా పనిచేస్తాయి. ఈ కొత్త ఫ్రేమ్‌వర్క్ బాండ్ మార్కెట్‌ను బలోపేతం చేయడమే కాకుండా, మార్కెట్ హెచ్చుతగ్గుల సమయంలో స్థిరత్వాన్ని అందిస్తుంది. దీనివల్ల వ్యాపారాలకు తక్కువ వడ్డీకే దీర్ఘకాలిక రుణాలు లభించే అవకాశం ఉంది.

తదుపరి చర్య:

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బిల్లును పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పరిశీలనకు పంపారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో దీనిపై నివేదిక వచ్చే అవకాశం ఉంది. సభాపతి నిర్ణయం మేరకు, ఈ కమిటీ వచ్చే పార్లమెంట్ సమావేశాల మొదటి రోజు నాటికి తన నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. ఈ బిల్లు వల్ల వేర్వేరు చట్టాల వల్ల వచ్చే వైరుధ్యాలు తగ్గుతాయి. కంపెనీలకు మార్కెట్ మధ్యవర్తులకు నిబంధనలు పాటించడం సులభమవుతుంది. పారదర్శకత పెరగడం వల్ల సామాన్య పెట్టుబడిదారులకు భద్రత పెరుగుతుంది. బాండ్ మార్కెట్ బలోపేతం కావడం వల్ల వ్యాపారాలకు తక్కువ వడ్డీకే పెట్టుబడి దొరుకుతుంది.

లోక్‌సభలో 'సెక్యూరిటీస్ మార్కెట్స్ కోడ్ బిల్లు' ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ - Tholi Paluku