Let's talk: editor@tmv.in
లోక్‌భవన్‌లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

లోక్‌భవన్‌లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

Gaddamidi Naveen
9 మార్చి, 2026

మహారాష్ట్ర గవర్నర్‌గా నూతన బాధ్యతలు స్వీకరించబోతున్న తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విడివిడిగా మర్యాదపూర్వకంగా కలిశారు. లోక్‌భవన్‌లో జరిగిన ఈ భేటీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కూడా పాల్గొన్నారు.

తెలంగాణ గవర్నర్‌గా గత రెండేళ్లుగా రాష్ట్రానికి ఆయన అందించిన సేవలను సీఎం ఈ సందర్భంగా కొనియాడారు. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలతో తెలంగాణకు కళలు, సంస్కృతి, సాంకేతికత, క్రీడల రంగాల్లో అనుసంధానం పెంచేందుకు ఆయన ప్రారంభించిన “తెలంగాణ – నార్త్ ఈస్ట్ ఇండియా కనెక్ట్” కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గవర్నర్‌ను శాలువాతో ఘనంగా సత్కరించి, మహారాష్ట్ర గవర్నర్‌గా చేపట్టబోయే కొత్త బాధ్యతల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రగతిలో ఆయన అందించిన సహకారం మరువలేనిదని నేతలు పేర్కొన్నారు.