Let's talk: editor@tmv.in
లోక్‌పాల్ ‘జోక్‌పాల్’గా మారింది: ఎంపీ ప్రియాంక చతుర్వేది

లోక్‌పాల్ ‘జోక్‌పాల్’గా మారింది: ఎంపీ ప్రియాంక చతుర్వేది

Pinjari Chand
23 అక్టోబర్, 2025

శివసేన (యూబీటీ)ఎంపీ ప్రియాంక చతుర్వేది బుధవారం లోక్‌పాల్ ఆఫ్ ఇండియాపై విమర్శలు గుప్పించారు. ఇటీవల లొక్​పాల్ 7 బీఎండబ్య్లూ లగ్జరీ 330 (లాంగ్ వీల్ బేస్)వాహనాలను కొనుగోలు చేయడానికి టెండర్లు పిలవడంతో దేశవ్యాప్తంగా విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా ఆమె అవినీతి నిరోధక సంస్థ అయిన లోక్‌పాల్ ‘జోక్‌పాల్’గా మారిందని వ్యంగంగా మాట్లాడారు. ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ భారత ప్రజలు అవినీతి పై విసుగెత్తడంతో 2014లో లోక్ పాల్ ఏర్పాటైంది. ఆ సమయంలో 7 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు అవినీతికి వ్యతిరేకంగా ఒక్క కేసును కూడా వెలికితీయలేదని ఆరోపించారు. ప్రధాని మోడీ దేశీయ ఉత్పత్తుల వాడకాన్ని ప్రోత్సహిస్తుండగా, లొక్‌పాల్ విదేశీ కార్ల కోసం టెండర్ ఎందుకు ఇచ్చింది? అవినీతి తో పోరాడటానికి ఏర్పాటైన సంస్థ ఇప్పుడు స్వయంగా అవినీతి లో చిక్కుకుందన్నారు.అందువల్ల దీన్ని జోక్ పాల్ అని పిలుస్తున్నాం అని చతుర్వేది మీడియాతో అన్నారు. పార్లమెంట్ సభ్యులే సెడాన్ లో వస్తున్నారు. కానీ లోక్ పాల్ సభ్యులు లగ్జరీ కార్లను కోరుకుంటుంది. దేశంలో పన్నులు చెల్లించేవారు ఈ సంస్థ వైపే ప్రస్తుతం చూస్తున్నారు.

లోక్ పాల్ కాదు షాక్ పాల్; జైరాం రమేష్

కాంగ్రెస్ నాయకులు కూడా ఈ నిర్ణయాన్ని విమర్శించారు. పార్టీ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్, లోక్ పాల్ ను ‘షాక్‌పాల్’ అని పేర్కొన్నారు. లోక్ పాల్ ఇప్పుడు లోక్‌పాల్ కాదు. ఇది షాక్‌పాల్, షౌక్ పాల్ గా మారిందన్నారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్నా హజారే, అర్వింద్ కేజ్రీవాల్, ‘ఇండియా అగైన్స్ కరప్షన్’ ఆర్ఎస్ఎస్ 2012–2013లో లోక్‌పాల్ ప్రాముఖ్యతపై పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. బీజేపీ కూడా దీని వలన ప్రయోజనం పొందింది. ఇప్పుడు లోక్ పాల్ పనితీరు చూడండి. ఏ విధమైన తనిఖీలు ఇప్పటి వరకు చేసింది? ఎంతమందిని అరెస్ట్ చేశారు అని రమేష్ ప్రశ్నించారు. లోక్ పాల్ లో ఎవరున్నారు. ప్రధానమంత్రి, హెంశాఖమంత్రికి కావాల్సిన వారే అందులో ఉన్నారు. వారు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు.

కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం కూడా ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సుప్రీం కోర్ట్ న్యాయమూర్తులు సాధారణ సేడాన్‌(సౌకర్యవంతమైన కార్లు)లను పొందుతున్నారని, లొక్‌పాల్ చైర్మన్, ఆరు సభ్యులకు బీఎండబ్య్లూ కార్లు అవసరమా అని ప్రశ్నించారు. ప్రజా ధనం వృథా చేయడం న్యాయమేనా? కనీసం ఒకరిద్దరు సభ్యులైన ఈ కార్లను తీసుకోకూడదని నిరాకరింలేదా?” అని చిదంబరం ఎక్స్ లో పోస్ట్ చేశారు.

ఈ వ్యాఖ్యల నేపథ్యంలో లొక్‌పాల్ ఆఫ్ ఇండియా ఇటీవల 7 బీఎండబ్య్లూ 330 ఎల్ఐ కార్లను కొనుగోలు చేసే ప్రక్రియను ప్రారంభించింది. మొత్తం ఖర్చు రూ.5 కోట్లు పైగా ఉండవచ్చని నివేదికలు చెబుతున్నాయి. వాహనాలు డెలివరీ అయిన తర్వాత, కంపెనీ లొక్‌పాల్ డ్రైవర్లు, సిబ్బందికి వాహనాల వ్యవస్థలు, భద్రతా లక్షణాలు, ఆపరేషన్ సూచనలను తెలుసుకునేందుకు వారం పాటు శిక్షణా కార్యక్రమం నిర్వహించనుంది.

లోక్‌పాల్ ‘జోక్‌పాల్’గా మారింది: ఎంపీ ప్రియాంక చతుర్వేది - Tholi Paluku