
లైంగిక వేధింపుల కేసు:హైదరాబాద్‌లో చార్టర్డ్ ఫ్లైట్ పైలట్‌పై కేసు నమోదు
చార్టర్డ్ ఫ్లైట్ పైలట్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. బెంగళూరులోని ఒక హోటల్‌లో 26 ఏళ్ల క్యాబిన్ సిబ్బంది సభ్యురాలి పై పైలట్ లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఈ కేసు నమోదైంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ సంఘటన నవంబర్ 18న బెంగళూరులో జరిగినప్పటికీ, బాధితురాలు హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన తర్వాత నగరంలోని బేగంపేట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిందని తెలిపారు.ఈ ఫిర్యాదు ఆధారంగా ‘జీరో ఎఫ్ఐఆర్’ క్రైమ్ చోటు సంబంధం లేకుండా నమోదు అయ్యే బీఎన్ఎస్, కింద సంబంధిత సెక్షన్ల క్రింద కేసు నమోదైంది.మేము కేసు నమోదు చేసి, దానిని తదుపరి విచారణ కోసం బెంగళూరులోని హలసూరు పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశాం. వారు ఈ కేసును విచారిస్తున్నారు అని తెలిపారు.
ప్రత్యక్షంగా, ఈ కేసు పై విచారణ ప్రస్తుతం బెంగుళూరు పోలీస్ అధికారులు చేపట్టారు. బాధితురాలు,పైలట్ మధ్య జరిగిన సంఘటనల వివరాలను సేకరించి, అన్ని ఆధారాలను పరిశీలిస్తున్నట్లు పోలీస్ అధికారులు పేర్కొన్నారు. ప్రాధమిక దర్యాప్తు పూర్తి అవగానే పైలట్ పై పూర్తి చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని అధికారులు పేర్కొన్నారు.
