Let's talk: editor@tmv.in
లక్ష్య సేన్కు చైనా ‘మాస్టర్స్’ స్ట్రోక్

లక్ష్య సేన్కు చైనా ‘మాస్టర్స్’ స్ట్రోక్

Koripelli Aditya
18 సెప్టెంబర్, 2025

లక్ష్య సేన్కి ఈ సంవత్సరం నడిచిన ఇదో అరుదైన సీజన్, ఈ సీజన్ ప్రయాణం తనకి ఒక నిరాశగా నిండిపోయింది అనే చెప్పాలి. సేన్ ఈ ఏడాది రెండు టోర్నీల్లో తొలి రౌండ్లోనే వెనుదిరిగిన అనంతరం, ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్లో తన బెస్ట్ మ్యాచ్లలో ఒకటిని ఆడి, జోనతన్ క్రిస్టీని నేరుగా గేమ్స్లో ఓడించి లాస్ట్ హోప్ గా నిలిచాడు. కానీ వెంటనే తదుపరి రౌండ్లో ఓటమి పాలవ్వడానికి ఎంతో సమయం పట్టలేదు. తరువాత మరిన్ని తొలి రౌండ్లలో పరాజయాలు కూడా ఎదురయ్యాయి. అయితే మకావ్ ఓపెన్లో సెమీఫైనల్కు చేరి మళ్లీ ఫామ్లోకి వస్తున్న సంకేతాలను సేన్ ఇచ్చాడు.

ఇదంతా చూసిన తరువాత, ప్రపంచ ఛాంపియన్షిప్లకు మంచి మోమెంటంతో వెళ్లాడు అనిపించింది. కానీ అక్కడ వచ్చిన డ్రా మ్యాచ్ మాత్రం దెబ్బ తగిలించిందనే చెప్పాలి. ప్రపంచ నంబర్ వన్ పప్లేయర్ అయిన షి యూ చీతోనే ఫస్ట్ రౌండ్లో తలపడవలసి వచ్చింది. మంచి గేమ్ ఆడిన, ఓటమిని తప్పించలేకపోయాడు. అయితే, ఆ నిరాశను పక్కన పెట్టి, హాంకాంగ్ ఓపెన్లో తన గత నవంబర్ తర్వాత మొట్టమొదటి ఫైనల్కి చేరాడు. ఇది అతనికి మళ్లీ బలమైన గమ్ ని చూపే సన్నాహన్ని కలిపించింది.

కానీ బుధవారం జరిగిన చైనా మాస్టర్స్ సూపర్ 750 టోర్నీలో, ఫ్రాన్స్కు చెందిన తోమా జూనియర్ పోపోవ్ చేతిలో 11-21, 10-21 స్కోర్తో కేవలం 30 నిమిషాల్లో పరాజయం పాలైయ్యాడు. ఇదంతా చూస్తే, హాంకాంగ్లో నిలబెట్టుకున్న జోరు ఒక్కసారిగా కొట్టుకొని పోయింది. అది కాక పోపోవ్ మెరుగైన ఆరంభం చేశి మంచి మూమెంటమ్ ని అందుకున్నాడు. జరిగిన నెట్ ర్యాలీలో విజయం సాధించి 5-3 ఆధిక్యంలోకి వెళ్లాడు. మధ్యకోర్ట్ నుంచి లక్ష్య సేన్ బ్యాక్హ్యాండ్ వైపు కొట్టిన స్మాష్, ఆ తర్వాత ఫోర్హ్యాండ్ కార్నర్ నుంచి లైన్ను దాటిన ఒక ఫోర్స్ స్మాష్తో 10-3కి లీడ్ తీసుకున్నాడు. లక్ష్య సేన్ ఆటలో దూకుడు కనిపించకపోగా. గతవారం చౌ తియెన్ చెన్తో ఆడినంత రక్షణాత్మక శక్తి కూడా కనిపించలేదు. తొలి గేమ్ ఇంటర్వల్కు 3-11తో వెనుకబడి ఉండగా. ఇంటర్వల్ తర్వాత లక్ష్య కాస్త ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. లైన్లను లక్ష్యంగా చేసుకొని కొన్ని షాట్లు ట్రై చేశాడు. స్కోరును 9-15 వరకు తల దించకుండా పోరాడాడు, కానీ అది ఒక్క మినహాయింపు మాత్రమే. పోపోవ్ మొదటి గేమ్ను చాలా అవలీలగా గెలిచి సేన్ ను ఘోర పరాజయనికి దారి తీశాడు.

రెండో గేమ్లో 1-6 వద్ద లక్ష్య అగ్రెసివ్ గా తన బ్యాడ్మింటన్ రాకెట్ను హాఫ్ స్మాష్ చేయడం విశేషం. కానీ అనంతరం పోపోవ్ బాడీలో బ్యాక్హ్యాండ్ వైపు కొట్టిన స్మాష్ను లైన్ జడ్జి అవుట్గా పేర్కొన్నట్టే కనిపించింది. కానీ చైర్ అంపైర్ మాత్రం పాయింట్ను పోపోవ్కి ఇచ్చాడు. ఈ నిర్ణయంతో లక్ష్యని అసంతృప్తి పరిచింది. కొద్దిసేపటికే అతను సాధారణంగా కొట్టే షాట్ను మిస్ చేసి 4-11తో వెనుకబడగా. ఇక పోపోవ్ నెట్ వద్ద పూర్తి ఆధిపత్యం చూపించి, ఒక ఫ్లాట్ ర్యాలీని 14-6కి ఆధిక్యం సాధించిన సమయంలో లక్ష్య ఓటమికి రంగం సిద్ధమై ఉంది. ఒకవేళ హాంకాంగ్ ఓపెన్లో జరిగిన రెండు, మూడు సెట్స్ మ్యాచ్లు, ఫిజికల్గా అతన్ని బలహీనపరిచాయేమో, కానీ అదే సమయంలో, చౌ తియెన్ చెన్ లాంటి ఎక్స్పర్ట్, వారం వారానికి కూడా పోటీలు ఆడుతూ యువ ఆటగాళ్లని కూడా ఓడిస్తున్న విషయాన్ని మరచిపోకూడదు.

లక్ష్య సేన్ ఆదివారం మాట్లాడుతూ, ‘ప్రపంచ ఛాంపియన్షిప్ తర్వాత ఇది మంచి వారం.చెప్పాలంటే, ప్రపంచ ఛాంపియన్షిప్లో కూడా మంచి మ్యాచ్ ఆడాను. శి యూ చీతో పోరాటాత్మకంగా ఆడి. మూడు నాలుగు వారాలు బాగా ప్రాక్టీస్ చేశాను. ఇప్పుడు అవి ఫలితాలివ్వడం సంతోషంగా ఉంది. గత రెండు మూడు నెలల్లో నేర్చుకున్న కొన్ని అంశాలు ఇప్పుడు మళ్లీ నాకు ఉపయోగపడుతున్నాయి. మరిన్ని విజయాలు సాధించాలంటే నన్ను నేను నమ్ముకోవాలి,’ అని తెలియజేశాడు.కానీ, హాంకాంగ్లో పెంచుకున్న ఆ జోరు, షెన్జెన్లో జరిగిన పోటీతో ఒక్కసారిగా మాయం అయ్యాయి.

లక్ష్య సేన్కు చైనా ‘మాస్టర్స్’ స్ట్రోక్ - Tholi Paluku