
రోడ్డు భద్రతా నియమాలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత: జిల్లా కలెక్టర్
Gaddamidi Naveen
1 ఫిబ్రవరి, 2026
జనగామ జిల్లాలో రోడ్డు భద్రత నియమాలను ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ప్రజలకు పిలుపునిచ్చారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా, శనివారం జిల్లా కలెక్టరేట్‌లో రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు జిల్లా స్థాయి రోడ్డు భద్రత అవగాహన క్విజ్ పోటీలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణాపాయానికి దారి తీస్తుందని అన్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. రోడ్డు నియమాలపై అవగాహన పెంపొందించుకోవడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు.
క్విజ్ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులకు కలెక్టర్ స్వయంగా బైక్ హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
