Let's talk: editor@tmv.in
రోగిని తరలిస్తున్న అంబులెన్స్‌పై దాడి

రోగిని తరలిస్తున్న అంబులెన్స్‌పై దాడి

Panthagani Anusha
30 అక్టోబర్, 2025

రోగిని తరలిస్తున్న అంబులెన్స్‌ను అడ్డుకొని, డ్రైవర్‌పై దాడి చేసి, వాహనాన్ని ధ్వంసం చేసిన దారుణ ఘటన కొట్టాయం ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం రాత్రి సుమారు 8.45 గంటల సమయంలో పథానాపురం నుంచి స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి రోగిని తీసుకెళ్తున్న అంబులెన్స్‌ను ముగ్గురు వ్యక్తులు అడ్డుకున్నట్లు సమాచారం. కాగా అంబులెన్స్ తమ బైక్‌ను ఢీకొట్టిందని ఆరోపిస్తూ, వారు వాహనాన్ని నిలిపివేసి డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగారు.

తర్వాత వాహన తలుపు తెరిచి డ్రైవర్‌పై దాడి చేయడంతో పాటు, అంబులెన్స్‌కు ద్వంసం చేసారు, అంతటితో ఆగకుండా అంబులెన్సు సైడ్ మిర్రర్‌ను పగలగొట్టి డ్రైవర్ పై దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన వీక్షిస్తున్న స్థానికులు సమయానికి జోక్యం చేసుకోవడంతో అంబులెన్స్‌ను అక్కడినుండి హాస్పిటల్ కి తరలించగలిగారు. అయితే రోగి ఆరోగ్య పరిస్థితి సురక్షితంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

మరోవైపు పోలీసులు ముగ్గురిలో ఒకరిని వారి ద్విచక్ర వాహన రిజిస్ట్రేషన్ నంబర్‌ ఆధారంగా గుర్తించారు. మొబైల్ టవర్ వివరాల ప్రకారం ప్రస్తుతం అతను కేరళ వెలుపల ఉన్నాడని అధికారులు వెల్లడించారు. మిగతా ఇద్దరి గుర్తింపుపై దర్యాప్తు కొనసాగుతోంది.

రోగిని తరలిస్తున్న అంబులెన్స్‌పై దాడి - Tholi Paluku