
రైల్వే జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాల గడువు పొడిగింపు
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. మొత్తం 2,569 జూనియర్ ఇంజనీర్ డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ ,కెమికల్ & మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తు గడువును పొడిగించడం జరిగింది. CEN నెం. 05/2025 నోటిఫికేషన్ ద్వారా ప్రకటించిన ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.
గతంలో దరఖాస్తులను సమర్పించడానికి నిర్ణయించిన చివరి తేదీని సవరిస్తూ, తాజాగా డిసెంబర్ 10, 2025 (రాత్రి 11:59 గంటల వరకు) వరకు గడువును పొడిగించారు. కొన్ని ప్రాంతాలలో ఖాళీల సంఖ్యలో మార్పులు జరిగాయి. ఈ మార్పుల కారణంగా అభ్యర్థులు తమ దరఖాస్తు వివరాలను సరిచూసుకోవడానికి అదనపు సమయం ఇవ్వాలనే ఉద్దేశంతో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఆర్ ఆర్ బి జమ్ము-శ్రీనగర్ పరిధిలోని ఆర్ సి ఎఫ్ కపుర్తలా ,ఆర్ఆర్ బి చెన్నై పరిధిలోని ఇసిఫ్ చెన్నైలలోని ఖాళీలలో మార్పులు జరిగినట్లు బోర్డు స్పష్టం చేసింది. ఈ ఒక్క మార్పు తప్ప నోటిఫికేషన్‌లోని ఇతర నిబంధనలు ఏవీ మారలేదు. దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 31, 2025 న ప్రారంభమైంది.
ఎవరు దరఖాస్తు చేయవచ్చు
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఇంజనీరింగ్‌లో డిగ్రీ (బీ.ఈ./బీ.టెక్) లేదా మూడేళ్ల డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ప్రొడక్షన్ వంటి సంబంధిత ఇంజనీరింగ్ విభాగాలకు చెందిన వారు అర్హులు.
వయోపరిమితిని జనవరి 1, 2026 నాటికి 18 నుండి 33 సంవత్సరాల మధ్య ఉండాలని నిర్ణయించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాల వారికి వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎంపికైన అభ్యర్థులకు 7వ కేంద్ర వేతన సంఘం ప్రకారం ₹35,400 తో పాటు పే లెవల్-6 లో జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు చేసుకున్న వారికి ముఖ్య గమనిక
గతంలో దరఖాస్తు సమర్పించిన అభ్యర్థులు కూడా తమ దరఖాస్తులో మార్పులు చేసుకోవడానికి అనుమతించబడింది. వారు తమ ఆర్ఆర్ బి ఎంపిక పోస్ట్ ప్రాధాన్యత ,జోనల్ రైల్వే/ప్రొడక్షన్ యూనిట్ వివరాలను ఉచితంగా మార్చుకోవచ్చు. ఈ సదుపాయం నవంబర్ 25, 2025 నుండి అందుబాటులో ఉంది. ఫీజు చెల్లింపు దరఖాస్తు దిద్దుబాట్లు ,స్కైబ్ వివరాల సమర్పణ గడువు కూడా కొత్త షెడ్యూల్‌కు అనుగుణంగా పొడిగించబడింది.
ఎంపిక విధానం, ఫీజు వివరాలు
అభ్యర్థులను మొత్తం నాలుగు దశల్లో ఎంపిక చేస్తారు. మొదట కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సిబిటి-I) ఉంటుంది. అందులో ఉత్తీర్ణులైన వారికి సిబిటి-II నిర్వహించబడుతుంది. ఆ తర్వాత పత్రాల పరిశీలన (డాక్యుమెంట్ వెరిఫికేషన్) ,వైద్య పరీక్ష (మెడికల్ ఎగ్జామినేషన్) జరుగుతాయి. కంప్యూటర్ పరీక్షల తేదీలను త్వరలో ప్రకటిస్తామని బోర్డు తెలిపింది.
దరఖాస్తు ఫీజు జనరల్ ఓబిసి ,ఈ డబ్ల్యూ ఎస్ అభ్యర్థులకు ₹500గా నిర్ణయించారు. ఎస్సి , ఎస్టి, పిడబ్ల్యూబిడి మాజీ సైనికులు ,అన్ని మహిళా అభ్యర్థులకు మాత్రం ఫీజు ₹250 మాత్రమే. ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులకు ఫీజు మినహాయించబడింది.
అభ్యర్థులు కేవలం అధికారిక ప్రాంతీయ ఆర్ ఆర్ బి వెబ్‌సైట్ల ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష ఫీజును విజయవంతంగా చెల్లించిన తర్వాతే దరఖాస్తు పూర్తయినట్లుగా పరిగణించబడుతుందని బోర్డు స్పష్టం చేసింది.
అడ్మిట్ కార్డులు ,పరీక్షా షెడ్యూల్ గురించిన తదుపరి సమాచారం త్వరలో వెలువడుతుందని ఆర్ ఆర్ బి తెలియజేసింది.
