
రైతుభరోసా, సున్నావడ్డీ, పంటల బీమా జగన్ పెట్టినవే: మాజీ మంత్రి కన్నబాబు
మాజీ మంత్రి కురసాల కన్నబాబు విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ …కౌలురైతులకు సి సి ఆర్ టి చట్టం ద్వారా రైతుభరోసా అందిస్తే చంద్రబాబు ఆ చట్టాన్ని తీసేశాడు. రైతుభరోసా, సున్నావడ్డీ, పంటల బీమా, పంట నష్టపరిహారం అన్ని సంక్షేమ పథకాలు కౌలురైతులకు ఇచ్చిన చరిత్ర కేవలం జగన్ మోహన్ రెడ్డిదే అన్నారు. రైతుభరోసాను పేరు మార్చి, పీఎం కిసాన్ కాకుండా 20వేలు అన్నదాత సుఖీభవ ద్వారా ఇస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పటికే ఒక ఏడాది ఎగ్గొట్టాడు అన్నారు. ఈ ఏడాది ఈ ప థ కం కింద ఇస్తున్న లెక్కలు చూస్తే విచిత్రంగా ఉన్నాయి. 7లక్షల మంది రైతులకు రైతుభరోసా అందకపోగా, దాదాపు 17వేల కోట్లు ఎగనామం పెట్టాడు చంద్రబాబు అంటూ విరుచుకుపడ్డారు. .
కూటమి ప్రభుత్వం వచ్చాక ఆర్బీకేలను నిర్వీర్యం చేశారు. తక్కువ ధరలకు ఎరువులు ఇవ్వలేకపోతున్నారు. వైయస్ జగన్ చేసిన వాటిని తాను చేసినట్టు గొప్పలు చెప్పుకుంటున్నారు. మోంథా తుఫానులో చంద్రబాబు ప్రచారం చేసుకున్నంత కూడా రైతులకు పంటనష్ట సాయం అందలేదు. అన్ని పార్టీలు చంద్రబాబు పక్షం కావచ్చు కానీ ప్రజల పక్షాన పోరాడేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందం టూ కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
