Let's talk: editor@tmv.in
రేపు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో విడుదల

రేపు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో విడుదల

Shaik Mohammad Shaffee
8 డిసెంబర్, 2025

పవర్ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న మాస్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం 'ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌'. 'గబ్బర్ సింగ్' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్-హరీష్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. ఇందులో శ్రీలీల ఫీమేల్ లీడ్‌గా నటిస్తుండగా, రాశీ ఖన్నా కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఈ సినిమా నుంచి అభిమానుల కోసం మేకర్స్ ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చారు. మీరు ప్రేమించిన పవర్‌ స్టార్‌ను మరింత ఎనర్జీ, స్టైలిష్‌ మూమెంట్స్‌తో తీసుకురాబోతున్నాం అంటూ.. 'ఉస్తాద్ భగత్ సింగ్' ఫస్ట్ సింగిల్ ప్రోమోను డిసెంబర్ 9న సాయంత్రం 6:30 గంటలకు విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటనతో పాటు, బ్లాక్ కలర్ స్టైలిష్ అవుట్‌ఫిట్‌లో ఉన్న పవన్ కళ్యాణ్ నయా పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.

ఈ మొదటి పాటను రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో రూపొందించారు. ఈ పాటకు భాస్కర భట్ల సాహిత్యం అందించగా, విశాల్ దద్లాని ఆలపించారు. ఈ పాటలో పవన్ కళ్యాణ్ డ్యాన్స్ అద్భుతంగా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. దీనిపై ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్, హరీష్ శంకర్ మంచి హైప్‌ను క్రియేట్ చేశారు. ఈ ప్రోమో విడుదలైన తర్వాత పూర్తి పాట విడుదల తేదీని కూడా మేకర్స్ ప్రకటించనున్నారు.

'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్ దాదాపు పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ సినిమాను 2026 మార్చి 26న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ "భగత్‌.. భగత్‌ సింగ్‌ మహంకాళి పోలీస్‌స్టేషన్‌, పత్తర్‌ గంజ్‌, ఓల్డ్‌ సిటీ", "ఈసారి పర్ఫార్మన్స్ బద్దలైపోద్ది" వంటి పవన్‌ కళ్యాణ్ డైలాగ్స్‌ సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి.

రేపు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో విడుదల - Tholi Paluku