
రేపటి నుంచి హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో మార్పులు
Gaddamidi Naveen
2 నవంబర్, 2025
హైదరాబాద్ మెట్రో రైలు సేవల సమయాల్లో మార్పు జరిగింది.రేపటి నుంచి అన్ని రోజులలోనూ మెట్రో రైళ్లు ఉదయం 6:00 గంటల నుంచి రాత్రి 11:00 గంటల వరకు అన్ని టర్మినల్ స్టేషన్ల నుంచి నడుస్తాయని మెట్రో రైలు అధికారులు ప్రకటించారు.
ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. కొత్త సమయాల ప్రకారం ప్రయాణం చేసేందుకు ప్రజలు ముందుగా ప్రణాళికలు చేసుకోవాలని సూచించారు.ఈ నిర్ణయం ట్రాఫిక్ తగ్గింపు, కాలుష్య నియంత్రణ, ప్రజా సౌకర్యాల మెరుగుదల దిశగా ముఖ్యమైన అడుగుగా పరిగణించవచ్చు.
ప్రస్తుతం అమల్లో ఉన్న మెట్రో రైలు సమయాలు
సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 6:00 గంటల నుంచి రాత్రి 10:30 గంటల వరకు.ఆదివారం రోజు ఉదయం 7:00 గంటల నుంచి రాత్రి 10:30 గంటల వరకు.
