
రేపటి నుంచి ‘అమృత్ ఉద్యాన్’ సందర్శించవచ్చు
ప్రసిద్ధ అమృత్ ఉద్యాన్ మంగళవారం నుంచి ప్రజలకు సందర్శన కోసం అందుబాటులో ఉంటుందని రాష్ట్రపతి భవన్ అధికారిక వర్గాలు తెలిపాయి.ఆదివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వింటర్ యాన్యూవల్ ఎడిషన్ 2026 ప్రారంభోత్సవానికి హాజరయ్యారని పేర్కోన్నారు. సాధారణ ప్రజలు ప్రతీ వారం ఆరు రోజులు, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు (చివరి ప్రవేశం 5 గంటలకు) ఉద్యాన్‌ను సందర్శించవచ్చు. సోమవారం బంద్ ఉంటుందని, అలాగే మార్చ్ 4 హోలి కారణంగా బంద్ ఉంటుందని ఓ ప్రకటనలో తెలిపారు. అమృత్ ఉద్యాన్ 2026 ఫిబ్రవరి 3 నుంచి మార్చ్ 31 వరకు ప్రజల కోసం తెరుస్తారు. ఈ ఏడాది ప్రత్యక్షంగా బుక్ చేసుకునే సౌకర్యం ఉండదని, సందర్శకులు ఆన్‌లైన్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోవాలన్నారు. బుకింగ్, ప్రవేశం ఉచితమని తెలిపారు.
ప్రవేశకులకు సూచన: ముందుగా ఆన్‌లైన్‌లో స్లాట్స్ బుక్ చేసుకోవాలి, టికెట్‌లో ఇచ్చిన సమయాన్ని, ఇతర సూచనలను పాటించాలి. రాష్ట్రపతి భవన్ లోని ఉద్యాన్ కొన్ని ప్రత్యేక వర్గాలకు మాత్రమే ప్రత్యేకంగా తెరుస్తారు. మార్చ్ 3న – రక్షణ సిబ్బంది, మార్చ్ 5 – వృద్ధులు, మార్చ్ 10 – మహిళలు, ట్రైబల్ మహిళల స్వయం సహాయక సంఘాల కోసం, మార్చ్ 13 – దివ్యాంగుల కోసం కేటాయించారని వివరించారు. సందర్శించే రోజు కంటే ముందు రోజు ఉదయం 10 గంటల లోపు ప్రవేశానికి బుకింగ్ చేసుకోవాలన్నారు. ప్రవేశం, బయటకు వెళ్లడానికి గేట్ నెం. 35, నార్త్ అవెన్యూ సమీపంలో ఉంటుంది. సెంట్రల్ సెక్రటరియేట్ మెట్రో స్టేషన్ నుంచి గేట్ 35 వరకు ప్రతి 30 నిమిషాలకు షట్లర్ బస్సులు ఉదయం 9:30 – సాయంత్రం 6 మధ్య అందుబాటులో ఉంటాయి. చివరి బస్ సాయంత్రం 4 కి ఉంటుందన్నారు.
సందర్శించే మార్గాలు: బాల్ వాటికా→ ఫ్లూమేరియా గార్డెన్→ బన్యాన్ గార్డెన్ → బోన్సాయ్ గార్డెన్ → బబ్లింగ్ బ్రూక్ → సెంట్రల్ లాన్ → లాంగ్ గార్డెన్ → సర్య్కూలర్ గార్డెన్ . ప్రధాన ఆకర్షణలు: తులిప్స్, వివిధ రకాల రోజ్‌లు (145 రకాలలో ‘భీమ్’, ‘అర్జున్’, ‘మదర్ థెరీసా’), బబ్లింగ్ బ్రూక్ (జల ప్రవాహం), బన్యాన్ గార్డెన్ (రిఫ్లెక్సాలజీ పాత్స్). విజిటర్లు మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ కీస్, పర్సులు/హ్యాండ్‌బ్యాగ్లు, వాటర్ బాటిళ్లు, ఇన్ఫంట్ మిల్క్ బాటిల్స్ తీసుకువెళ్లవచ్చు. ఉద్యాన్ లో తాగునీరు, టాయిలెట్లు, ఫస్ట్ ఎయిడ్/మెడికల్ సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయి. అమృత్ ఉద్యాన్‌తో పాటు, ప్రజలు రాష్ట్రపతి భవన్, మ్యూజియాన్ని కూడా మంగళవారం నుంచి ఆదివారం వరకు సందర్శించవచ్చు. ప్రతీ శనివారం చేంజ్ ఆఫ్ గార్డ్ వేడుకను రాష్ట్రపతి భవన్ ఫోర్కోర్ట్‌లో వీక్షించవచ్చు.
