Let's talk: editor@tmv.in
రెడ్డి కాలనీ అసోసియేషన్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఉప్పల్ ఎమ్మెల్యే

రెడ్డి కాలనీ అసోసియేషన్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఉప్పల్ ఎమ్మెల్యే

Gaddamidi Naveen
14 మార్చి, 2026

ఉప్పల్ నియోజకవర్గంలో సామాజిక కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయి. చక్రిపురం ఎక్స్‌ రోడ్ వద్ద ఉన్న రెడ్డి కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యాలయాన్ని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కాలనీ వాసులతో కలిసి స్థానిక సమస్యలపై చర్చించారు.

కార్యాలయ ప్రారంభోత్సవం అనంతరం కాలనీలో మౌలిక సదుపాయాల కల్పనపై ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, పారిశుధ్యం మెరుగుదలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఆయన హామీ ఇచ్చారు. స్థానిక సమస్యల పరిష్కారానికి అసోసియేషన్ ప్రతినిధులు నిరంతరం సమన్వయం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు మహేష్ గౌడ్, కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

రన్ ఫర్ షీ 2026 పోస్టర్ ఆవిష్కరణ

అదే వేదికపై, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉప్పల్ రన్నర్స్ సంస్థ నిర్వహించనున్న ర‌న్ ఫ‌ర్ షీ 2026 ప్రత్యేక రన్ కార్యక్రమ పోస్టర్‌ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. మహిళల ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై అవగాహన పెంచడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఈ రన్‌లో 5కే, 10కే విభాగాలలో పురుషులు, మహిళలు ఇద్దరూ పాల్గొనే అవకాశం కల్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కాలనీ నివాసితులు పాల్గొన్నారు.

రెడ్డి కాలనీ అసోసియేషన్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఉప్పల్ ఎమ్మెల్యే - Tholi Paluku