Let's talk: editor@tmv.in
రెచ్చగొట్టేలా సోషల్ మీడియా పోస్ట్.. ఆదిలాబాద్‌లో యువకుడి అరెస్ట్

రెచ్చగొట్టేలా సోషల్ మీడియా పోస్ట్.. ఆదిలాబాద్‌లో యువకుడి అరెస్ట్

Gaddamidi Naveen
4 ఫిబ్రవరి, 2026

మతసామరస్యానికి విఘాతం కలిగించేలా సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే సందేశాలను పోస్ట్ చేసిన ఒక 20 ఏళ్ల యువకుడిని ఆదిలాబాద్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.

పోలీసుల తెలిపిన వివ‌రాల‌ ప్రకారం.. జిల్లాలోని బేల మండలంలో రెండు వర్గాల మధ్య విద్వేషాన్ని, శత్రుత్వాన్ని ప్రేరేపించే ఉద్దేశంతో సదరు యువకుడు తన సోషల్ మీడియా ఖాతాలో వివాదాస్పద పోస్టులు పెట్టాడు. దీనిపై అందిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల వేళ శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా అశాంతిని సృష్టించేందుకు ప్రయత్నించే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు పోలీసు యంత్రాంగం స్పష్టం చేసింది. ఇలాంటి అవాంఛనీయ పోస్టులు చేసే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

రెచ్చగొట్టేలా సోషల్ మీడియా పోస్ట్.. ఆదిలాబాద్‌లో యువకుడి అరెస్ట్ - Tholi Paluku