
రెండు రాష్ట్రాల బీజేపీ బలోపేతంపై నేతల కీలక భేటీ
నాంపల్లి లోని రాష్ట్ర కార్యాలయంలో శనివారం తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుతో పార్టీ నాయకులు, కార్యకర్తలతో చర్చకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం, రాబోయే ఎన్నికల వ్యూహం, కార్యకలాపాల సమన్వయంపై చర్చ జరిగింది.
సభ్యులు, నాయకులు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని పెంపొందించేందుకు భవిష్యత్తులో సమర్థమైన ప్రణాళికలు రూపొందించేందుకు మార్గాలను పరిశీలించారు. ముఖ్యంగా రెండు రాష్ట్రాల మధ్య సమన్వయం భవిష్యత్తులో కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో పార్టీ కార్యకలాపాలను మరింత బలంగా విస్తరించడానికి అనేక అంశాలను చర్చించామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకుల పాత్ర, పార్టీ శ్రేణుల్లో సామరస్యాన్ని పెంపొందించే చర్యలు, యువత, మహిళలలో న్యాయ కార్యకలాపాల ప్రాధాన్యతపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.
సభలో రాబోయే ఎన్నికల వ్యూహం పై చర్చకు ప్రాధాన్యం ఇచ్చారు. స్థానిక సమస్యలను గుర్తించి, ప్రజల మన్నన పొందే విధంగా ప్రజాభిప్రాయ సేకరణ, ప్రచార పద్ధతులను సమీక్షించారు. ప్రతి జిల్లాలో పార్టీ కార్యకర్తల సంఖ్య, సభ్యత్వ విస్తరణ, సామాజిక ఆర్థిక సమస్యలపై అవగాహన కల్పించారు. తదితర అంశాలను కూడా ప్రణాళికలో ఉంచారు.కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను, పథకాలను రెండు రాష్ట్రాల ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లడం, ఇందుకోసం ఇరు రాష్ట్రాల పార్టీ శ్రేణుల మధ్య మెరుగైన సమన్వయం అవసరాన్ని గుర్తించారు.
ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ నేతలు మాట్లాడుతూ, ఇరు రాష్ట్రాల మధ్య పటిష్టమైన సమన్వయంతో పనిచేయడం ద్వారా కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో పార్టీని మరింత బలంగా విస్తరించడానికి కట్టుబడి ఉన్నామని మాధవ్‌కు తెలియజేశారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి కీలక సమన్వయ సమావేశాలను తరచుగా నిర్వహించాలని నేతలు నిర్ణయించినట్లు సమాచారం. ఈ భేటీ రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ తన రాజకీయ అజెండాను మరింత దూకుడుగా ముందుకు తీసుకెళ్లడానికి సంకేతంగా నిలుస్తోంది.
తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేసే లక్ష్యంగా పెట్టుకుందా? అనే విషయాలు తెలియాలి.
