
రూ.2,700 కోట్ల బ్యాంకు మోసం కేసులో ఈడీ సోదాలు
మనీలాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)శుక్రవారం పశ్చిమ బెంగాల్, తెలంగాణ, గుజరాత్‌లలోని 12 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఈడీ కోల్‌కతా జోనల్ కార్యాలయం ఈ దాడులను చేపట్టింది.పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో 10 ప్రాంతాలు, తెలంగాణలోని హైదరాబాద్‌లో ఒక చోట, గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఒక చోట మొత్తం 12 చోట్ల ఈ సోదాలు జరిగాయి. కొన్ని ప్రత్యేక సమాచారంతో రాష్ట్ర పోలీసు బలగాలతో సమన్వయం చేసుకుంటూ ఈ దాడులు నిర్వహించినట్టు అధికారులు తెలిపారు.
"ఈ కేసుతో సంబంధం ఉన్న అనుమానితుల కార్యాలయాలు, నివాసాలలో సోదాలు జరుగాయి నగల తయారీ సంస్థకు సంబంధించిన మనీలాండరింగ్ ఆర్థిక అవకతవకలపై జరుగుతున్న ఈడీ దర్యాప్తులో భాగంగా ఈ సోదాలుజరిగాయి. బ్యాంకు నిధుల దారి మళ్లింపు వివరాలను తెలుసుకోవడానికి, లబ్ధిదారులు మోసాలు ఎలా చేశారు గుర్తించడానికి ఏజెన్సీ లావాదేవీలను, రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు.
