
రూ. 29 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ శంకుస్థాపన
సదాశివపేట మండలంలోని మండలంలోని వివిధ గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆదివారం పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా మొత్తం రూ. 29 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
ముబారక్‌పూర్–ఏ రూ. 7 లక్షలు, వెల్టూర్ రూ. 8 లక్షలు,కొనాపూర్ రూ. 8 లక్షలు, నాగసన్‌పల్లి, రూ. 6 లక్షల పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం కొనాపూర్ గ్రామానికి చెందిన వార్డు సభ్యులు ఆశం, ఆదిల్ ఇద్దరూ సర్పంచ్ లు అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో చింత ప్రభాకర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికల వరకే రాజకీయాలని, గెలిచిన ప్రజాప్రతినిధులు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని హితవు పలికారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఉచిత హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని, ఏ వర్గం ప్రజలు కూడా ప్రస్తుతం సంతోషంగా లేరని విమర్శించారు. రాబోయే రోజుల్లో ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గ్రామాల అభివృద్ధికి సర్పంచులు నిరంతరం కృషి చేయాలని ఆయన సూచించారు.
