
రీతూ, పవన్ రిలేషన్ పై సంజన వ్యాఖ్యలు..నాగ్ సీరియస్ వార్నింగ్
తెలుగు బిగ్‌బాస్ సీజన్ 9 గ్రాండ్ ఫినాలేకు చేరుకుంది. ప్రతి శనివారం నాగార్జున ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఉదయం నుంచి కళ్లు కాయలు కాస్తూ ఎదురుచూస్తారు. ఈవారం కూడా అదే ఉత్కంఠ. నామినేషన్లలో జరిగిన భారీ రచ్చ, రీతూ డీమాన్ పవన్‌లపై సంజనా పర్సనల్ ఎటాక్స్, కళ్యాణ్ మెడ పట్టుకోవడం... ఈ అంశాలపై నాగ్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో ? అని అందరూ ఆసక్తిగా వేచి చూశారు.
అయితే ప్రోమో కాస్త ఆలస్యంగా వచ్చింది. ముందుగా విడుదలైన ప్రోమోలో సర్ఫ్ యాక్సిల్ టాస్క్‌లో తనూజ మరోసారి తన సీరియల్ నటి రూపం చూపించింది. సంచాలక్‌గా దివ్యను నియమించగా, భరణి సుమన్ ఒక టీమ్, రీతూ తనూజ మరో టీమ్‌గా పోటీ పడ్డారు. భరణి టీమ్ గెలవగానే తనూజ ఏడుపు మొదలైంది. సీజన్ మొత్తం ఒక్కరికే సంచాలక్ ఇవ్వండి బిగ్‌బాస్ అంటూ దివ్యపై ఫైర్ అయింది. దీంతో భరణి ‘రూల్స్ నీకొక్కదానికే తెలుసా? లొడలొడలాడొద్దు’ అని కౌంటర్ ఇచ్చాడు. తనూజ మరింత రెచ్చిపోయి ‘పిచ్చి మాటలు అనొద్దు’ అంటూ వాగుదాడి చేసింది. మొన్నటి దాకా ఆడియన్స్ కు తండ్రి కూతుళ్ళ ప్రేమ బుల్లి తెరపై చూపిన ఈ నటుల్లో ఇప్పుడు మరో కొత్త కోణం అంటూ ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు.
అసలు రెండో ప్రోమోలో నాగార్జున పసుపు చొక్కాలో సీరియస్‌గా ఎంట్రీ ఇచ్చాడు. “ఫ్యామిలీ వీక్ తర్వాత అందరూ సరదాగా ఉంటారనుకున్నా, కానీ నేను హ్యాపీగా లేను” అంటూ నేరుగా సంజనా రీతూ గొడవ దగ్గరకు వచ్చాడు. ఇమ్మానుయేల్‌ను నిన్ను ఎక్కువగా డిస్టర్బ్ చేసిన గొడవ ఏంటి? అని అడగ్గా, సంజనా రీతూ గొడవే సార్, హౌస్ మొత్తం డిస్టర్బ్ అయింది అని సమాధానం వచ్చింది. సుమన్ ఒక అమ్మాయి క్యారెక్టర్‌ను బ్లేమ్ చేయడమే కదా సార్ అని అనగా, డీమాన్ పవన్ వారికీ వంతు పట్టినట్టు ఇలా మాట్లాడుతుందని కలలో కూడా అనుకోలేదు సార్ అని ఏమి ఎరగనట్టు అమాయకంగా మొహం పెట్టి చెప్పాడు.
సంజనా మాత్రం, నాకు అన్‌కంఫర్ట్‌గా ఉంది, చూడలేకపోతున్నా అని గట్టిగా చెప్పింది. అంతే నాగార్జున సీరియస్ మోడ్ ఆన్, నువ్వు ఫీల్ అయ్యావా? హౌస్ మొత్తం ఫీల్ అయ్యేలా చేశావా?, వాళ్ల రిలేషన్ ఏంటో నీకు ఏం పని? నామినేషన్‌లో పర్సనల్ ఎజెండాతో పర్సనల్ ఎటాక్ చేశావ్. నీకు కంఫర్ట్ లేకపోతే గేట్లు ఓపెన్... వెళ్లిపో, హౌస్ వాతావరణాన్ని స్పాయిల్ చేశావ్ అంటూ సంజనకు గట్టి క్లాస్ పీకాడు.
తనూజ గ్రాఫ్ గత కొన్ని వారాలుగా డౌన్ అవుతోంది. ఏ చిన్న విషయానికైనా ఏడుపు, గొడవ, ఓవర్ ఎమోషన్స్, అసలైన సీరియల్ యాక్టింగ్ బిగ్ బాస్ లో చూపిస్తుంది అంటూ నెట్టింట్లో కామెంట్లు మొదలయ్యాయి. తను గెలిస్తే అందరూ మంచోళ్లు, ఓడిపోతే రూల్స్ మీద ఆర్డర్లు. ఇక రీతూ వైపు నిలబడి నాగ్ మెప్పించాలన్న ప్రయత్నంలోనూ ఈ టాస్క్‌లో ఓడిపోయి మరింత నెగెటివిటీ మూటగట్టుకుంది. వారాలు గడుస్తున్న కొద్దీ తనూజ అసలు రంగులు బయటపడుతున్నాయి. మొదట్లో ఒకలాగా ఇక ఇప్పుడు మరోలాగా వేరియేషన్స్ చూపిస్తుంది.
ఈరోజు ఎపిసోడ్‌లో నాగార్జున ఎవరికి ఎలాంటి క్లాస్ పీకుతాడు, రీతూ డీమాన్‌ల రాత్రి గడిపే విషయంపై సంజనా చేసిన ఆరోపణలు ఆటను ఏ వైవు నడిపిస్తున్నాయి. కళ్యాణ్‌ను పీక పట్టుకున్న డీమాన్, ప్రాపర్టీ ధ్వంసం చేసిన కళ్యాణ్, ఆరోపణల్లో సంజన ఈ ముగ్గురిలో ఎవరికైనా రెడ్ కార్డ్ పడుతుందా? లేక తనూజ ఏడుపులకు బ్రేక్ పడుతుందా? అని ఈ రెండు రోజులు మరింత ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రేక్షకులు టీవీ ముందు అతుక్కుపోయి ఎదురుచూస్తున్నారు.
