Let's talk: editor@tmv.in
రాష్ట్రవ్యాప్తంగా శనగల కొనుగోలు ప్రారంభం: మంత్రి అచ్చెన్నాయుడు

రాష్ట్రవ్యాప్తంగా శనగల కొనుగోలు ప్రారంభం: మంత్రి అచ్చెన్నాయుడు

Dantu Vijaya Lakshmi Prasanna
19 ఫిబ్రవరి, 2026

రబీ సీజన్ 2025-26లో పండించిన శనగలను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించినట్లు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అమరావతిలో జరిగిన ఒక కార్యక్రమంలో తెలిపారు.

ధర మద్దతు పథకం కింద నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, భారత జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య సంస్థల ద్వారా ప్రభుత్వం మొత్తం 94,500 మెట్రిక్ టన్నుల శనగలను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నదని, ఈ మేరకు కేంద్రం నుంచి మంగళవారమే స్పష్టమైన ఆదేశాలు అందాయని ఆయన వెల్లడించారు.

బుధవారం నుంచే కొనుగోళ్లు - సిఎమ్౦ యాప్ ద్వారా పారదర్శకత

బుధవారం (ఫిబ్రవరి 18) నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైంది. రైతులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు సిఎ౦ యాప్ ద్వారా ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. ప్రతి జిల్లాలో జాయింట్ కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీలు ఈ కొనుగోళ్లను నిరంతరం పర్యవేక్షిస్తాయి. దీనివల్ల మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పారదర్శకత పెరుగుతుందని మంత్రి పేర్కొన్నారు.

రైతు సేవా కేంద్రాల్లో విక్రయ సౌకర్యం

రైతులు తమ పంటను సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా, గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాల వద్దే నమోదు చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. వ్యవసాయ, ఉద్యానవన, మార్కెటింగ్, ఏపీ మార్క్‌ఫెడ్ వంటి వివిధ శాఖల సమన్వయంతో ఈ కేంద్రాల్లో కొనుగోళ్లు జరుగుతాయి. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, రైతు ఉత్పత్తిదారులసంస్థలు, స్వయం సహాయక సంఘాలను కూడా ఈ ప్రక్రియలో భాగస్వాములను చేశామని మంత్రి తెలిపారు.

3.25 లక్షల హెక్టార్లలో సాగు - రికార్డు స్థాయి ఉత్పత్తి అంచనా

ఈ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3.25 లక్షల హెక్టార్లలో శనగ సాగు జరగగా, దాదాపు 3.77 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. రైతులు పండించిన పంటకు సరైన ధర కల్పించి, వారిని ఆర్థికంగా ఆదుకోవడమే కూటమి ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. సేకరించిన శనగలను సురక్షితంగా CWC/SWC గోదాముల్లో భద్రపరుస్తారు.

15 రోజుల్లోనే నేరుగా ఖాతాల్లోకి నగదు

రైతులకు చెల్లింపుల విషయంలో ఎటువంటి జాప్యం జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. శనగలు విక్రయించిన 15 రోజుల లోపు నగదును నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. అన్నదాతల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, గిట్టుబాటు ధర విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

సిఎం యాప్ అంటే..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సిఎం యాప్ అనేది ప్రధానంగా వ్యవసాయ శాఖ అధికారులు, రైతు సేవా కేంద్రాల సిబ్బంది కోసం రూపొందించబడిన ఒక పర్యవేక్షక వేదిక. ఈ యాప్ ద్వారా క్షేత్రస్థాయిలో రైతులు పండించిన శనగల సాగు వివరాలను, ఈ-క్రాప్ డేటాను సరిచూసి, కొనుగోలు ప్రక్రియను పారదర్శక weగా నిర్వహిస్తారు. రైతులు నేరుగా ఈ యాప్‌లో వివరాలు నమోదు చేయలేకపోయినా, ప్లే స్టోర్‌లో దీని పురోగతిని చూసేందుకు ఇది అందుబాటులో ఉంటుంది.

రైతులు తమ పంటను విక్రయించాలంటే, ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకంతో తమ సమీపంలోని రైతు సేవా కేంద్రం అధికారులను సంప్రదించాలి. అక్కడి సిబ్బంది ఈ సిఎం యాప్ ద్వారా మీ వివరాలను నమోదు చేసి, మీకు ఒక నిర్దిష్ట కొనుగోలు తేదీని కేటాయిస్తారు. ఇలానమోదు చేసుకోవడం వల్ల మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, ప్రభుత్వం నిర్ణయించిన గిట్టుబాటు ధర నేరుగా మీ ఖాతాలో పడేలా ఈ యాప్ ఒక వంతెనలా పనిచేస్తుంది.