Let's talk: editor@tmv.in
రాళ్ల అనంతపురంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే సురేంద్ర బాబు ఆకస్మిక తనిఖీ

రాళ్ల అనంతపురంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే సురేంద్ర బాబు ఆకస్మిక తనిఖీ

Panthagani Anusha
1 ఏప్రిల్, 2026

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు హెచ్చరించారు. మంగళవారం కంబదూరు మండలం రాళ్లనంతపురం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని తరగతి గదులు, వంటగది, టాయిలెట్లను పరిశీలించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం మధ్యాహ్న భోజన నాణ్యతను స్వయంగా పరిశీలించేందుకు ఎమ్మెల్యే విద్యార్థులతో కలిసి కూర్చున్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు వాదించిన పులిహోర నాణ్యత ఆశించిన స్థాయిలో లేకపోవడం, ఎగ్ ఫ్రై ఇవ్వాల్సిన చోట కేవలం ఉడకబెట్టిన గుడ్డు మాత్రమే ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కాగా వేసవి ఒడిదొడుకుల దృష్ట్యా ఉదయం పూట బడులు నడుస్తున్నాయని, భోజనం మధ్యాహ్నం 12:30 వరకు ఆలస్యం కావడం వల్ల తాము ఇబ్బంది దురుకుంటున్నామని విద్యార్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు కాగా దీనిపై స్పందించిన ఆయన ఇకపై ఉదయం 10:30 గంటలకే భోజనం సిద్ధం చేయాలని డీఈఓను ఆదేశించారు.

అదేవిధంగా పాఠశాల మౌలిక సదుపాయాలపై దృష్టి సారించిన ఎమ్మెల్యే, గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అసంపూర్తిగా మిగిలిన భవనాలు, వంటగది, టాయిలెట్లను తన సొంత నిధులతో పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థుల సౌకర్యార్థం రూ. 26,000 విలువైన 80 యోగా మ్యాట్లను అందజేశారు. విద్యా ప్రమాణాల్లో రాజీ పడకూడదని, మెనూ పాటించని పక్షంలో కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.