Let's talk: editor@tmv.in
రాయనపాడు రైల్వే స్టేషన్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోడీ
రాయనపాడు రైల్వే స్టేషన్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోడీ
రాయనపాడు రైల్వే స్టేషన్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోడీ

రాయనపాడు రైల్వే స్టేషన్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోడీ

Gaddamidi Naveen
18 జులై, 2026

ఎన్టీఆర్ జిల్లాలోని రాయనపాడు రైల్వే స్టేషన్ సరికొత్త హంగులతో అందుబాటులోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక అమృత్ భారత్ స్టేషన్ పథకం (ఏబీఎస్‌ఎస్) కింద ఆధునీకరించిన ఈ రైల్వే స్టేషన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం వర్చువల్‌గా ప్రారంభించారు. భారతీయ రైల్వే స్టేషన్లను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేసే విజన్‌లో భాగంగా సుమారు రూ. 36 కోట్ల వ్యయంతో ఈ స్టేషన్‌ను విమానాశ్రయ స్థాయి మౌలిక సదుపాయాలు, ప్రయాణీకుల వసతులతో పునరాభివృద్ధి చేశారు.

ఈ సందర్భంగా రాయనపాడు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు దేశవ్యాప్తంగా 75 స్టేషన్లను ప్రారంభించారు.. అందులో భాగంగా ఇక్కడ ఈ స్టేషన్‌ను ప్రారంభించుకోవడం దానికి సరికొత్త రూపాన్ని తెచ్చిందని అన్నారు. అలాగే దేశీయ సాంకేతిక సామర్థ్యానికి నిదర్శనంగా హైడ్రోజన్ శక్తితో నడిచే రైలును ప్రధాని ప్రారంభించారని పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా అభివృద్ధి చేస్తున్న 1,000 అమృత్ భారత్ స్టేషన్లలో ఆంధ్రప్రదేశ్‌కు 72 స్టేషన్లు కేటాయించడం ఎన్డీమే ప్రభుత్వం రాష్ట్రానికి ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనమని అన్నారు. తన పార్లమెంట్ పరిధిలో మూడు స్టేషన్లు ఈ పథకం కింద అభివృద్ధి చెందడం ఆనందంగా ఉందన్నారు. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సహకారంతో రాయనపాడు, ఈలప్రోలు, గొల్లపూడి ప్రాంతాల్లో రైల్వే వంతెనలు, అండర్‌పాస్‌లకు ఆమోదం పొందినట్లు తెలిపారు. విజయవాడ ప్రధాన రైల్వే స్టేషన్‌ను రూ.835 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. ఈ వర్చువల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ, పలువురు రైల్వే అధికారులు పాల్గొన్నారు.

విమానాశ్రయ స్థాయి వసతులు

ఫ్లాగ్‌షిప్ రైల్వే ఆధునీకరణ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో ఎంపిక చేసిన 21 స్టేషన్లలో పనులు పూర్తి చేసుకుని ప్రారంభమైన మొదటి స్టేషన్ రాయనపాడు కావడం విశేషం అని ఒక సీనియర్ రైల్వే అధికారి తెలిపారు. ఈ స్టేషన్ పునరాభివృద్ధిలో స్థానిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తూనే ఆధునిక మౌలిక సదుపాయాలను జోడించారు. విశాలమైన సర్క్యులేటింగ్ ఏరియా, తగినంత పార్కింగ్ స్థలం, ప్రీమియం ఇంటీరియర్స్, ఆధునిక లాంజ్‌లు, అప్‌గ్రేడ్ చేసిన టికెట్ కౌంటర్లు ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రయాణీకుల సౌకర్యార్థం హై-స్పీడ్ లిఫ్టులు, ఎస్కలేటర్లతో పాటు దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక స్నేహపూర్వక వసతులను కల్పించారు.

రద్దీగా ఉండే ప్రాంతాలను వెడల్పు చేసి, ప్రయాణీకుల రాకపోకలు సజావుగా సాగేలా పునర్నిర్మించారు. స్థానిక గుర్తింపును కాపాడుతూనే, ప్రయాణీకులకు విమానాశ్రయ ప్రమాణాలతో కూడిన ప్రీమియం ప్రయాణ అనుభవాన్ని అందించడమే ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశమని రైల్వే అధికారులు వివరించారు.

ట్యాగ్‌లు
RayanapaduRailwayStationAmritBharatStationRayanapaduAndhraPradeshNTRDistrictNarendraModiPMModiIndianRailwaysRailwayDevelopmentVijayawadaKesineniSivanath
రాయనపాడు రైల్వే స్టేషన్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోడీ - Tholi Paluku