
రాజ్‌భవన్‌లో ఉపరాష్ట్రపతికి తేనీటి విందు.. హాజరైన సీఎం,కేంద్రమంత్రులు
Gaddamidi Naveen
17 నవంబర్, 2025
భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ హైదరాబాద్ పర్యటనకు విచ్చేసిన సందర్భంగా, రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆయన గౌరవార్థం రాజ్‌భవన్‌లో తేనీటి విందు ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.గవర్నర్ ఏర్పాటు చేసిన ఈ తేనీటి విందులో ముఖ్యమంత్రితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.వారిలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ రాష్ట్ర మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. అంతకు ముందు బేగంపేట విమానాశ్రయంలో గవర్నర్, సీఎం.. ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్‌కు స్వాగతం పలికారు.
