Let's talk: editor@tmv.in
రాజీవ్ స్వగృహ ఓపెన్ ప్లాట్ల బహిరంగ వేలం

రాజీవ్ స్వగృహ ఓపెన్ ప్లాట్ల బహిరంగ వేలం

Gaddamidi Naveen
11 నవంబర్, 2025

తెలంగాణ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ద్వారా అభివృద్ధి చేయబడిన లే అవుట్లలో నివాస భవనాల నిర్మాణానికి అనువైన 163 ఓపెన్ ప్లాట్లను బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నారు.ఈ వేలం నవంబరు 17,18 తేదీల్లో నిర్వహించబడనుంది.అయితే,ప్లాట్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది నవంబరు 15గా నిర్ణయించబడింది.

మేనేజింగ్ డైరక్టర్ వి.పి.గౌతం వివ‌రాల ప్ర‌కారం,ఈ ప్లాట్లు నగరానికి సమీపంలో ఉన్న తొర్రూర్,బహదూర్ పల్లి,కుర్మల్ గూడ ప్రాంతాలలో ఉన్నాయి.తొర్రూర్‌లో 200 నుంచి 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో 125ప్లాట్లు, కుర్మల్ గూడలో 200 నుంచి 300చదరపు గజాల విస్తీర్ణంలో 25ప్లాట్లు,బహదూర్ పల్లిలో 200నుంచి1000 చదరపు గజాల విస్తీర్ణంలో 13ప్లాట్లు విక్రయానికి నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ ప్లాట్లలో ఇప్పటికే మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయని తద్వారా ఇల్లు నిర్మించుకునే అభ్యర్థులు తక్షణమే వాస్తవికంగా ఉపయోగించే సౌకర్యాలు పొందగలుగుతారు అని ఆయ‌న సూచించారు.వేలం పెద్ద అంబర్ పేట్‌లోని అవికా కన్వెన్షన్‌ హాల్‌లో నిర్వహించబడనుంది.తొర్రూర్ ప్రాంతంలోని 125 ప్లాట్లకు ఈ వేలం 17,18 తేదీల్లో కొనసాగుతుంది.బహదూర్ పల్లి,కుర్మల్ గూడలోని మిగతా ప్లాట్ల బహిరంగ వేలం 18నవంబర్ మధ్యాహ్నం నుంచి ప్రారంభం కానుందన్నారు.

ప్రస్తుతం తొర్రూర్‌లోని 885ప్లాట్లలో 517ప్లాట్లు ఇప్పటికే విక్రయించబడ్డాయని,మిగిలిన 125 ప్లాట్లపై ఈ బహిరంగ వేలం కొనసాగుత‌య‌ని,ప్రాజెక్టు సైట్‌ వద్దకు వెళ్తూ ప్రజలు నచ్చిన ప్లాట్లను పరిశీలిస్తున్నామ‌ని మౌలిక సదుపాయాల గుణాత్మకతను తనిఖీ చేస్తున్నారు అని తెలిపారు.ఇప్పటికే ఇక్కడ నివసిస్తున్న కుటుంబాలతో మాట్లాడుతూ,భవిష్యత్తులో ఇల్లు నిర్మించుకోవడానికి వివిధ అంశాలను పరిశీలన జ‌రుగుతుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

ఈ ప్రాంతంలో గృహావసర భూములపై డిమాండ్ అధికంగా ఉండటంతో,కొత్తగా విక్రయించబడ్డ ప్లాట్లపై సాధారణ ప్రజల ఆసక్తి గణనీయంగా ఉంది.నగరానికి సమీపంలో,అవుటర్ రింగ్ రోడ్‌కి దగ్గరగా ఉండడం వల్ల ఈ లే అవుట్లు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి.

రాజీవ్ స్వగృహ ఓపెన్ ప్లాట్ల బహిరంగ వేలం - Tholi Paluku