Let's talk: editor@tmv.in
రాజధానిని 16 వ నంబర్ జాతీయ రహదారికి త్వరితగతిన అనుసందానం చేయాలి - మంత్రి నారాయణ

రాజధానిని 16 వ నంబర్ జాతీయ రహదారికి త్వరితగతిన అనుసందానం చేయాలి - మంత్రి నారాయణ

Dantu Vijaya Lakshmi Prasanna
23 నవంబర్, 2025

ఇటీవల రాజధాని నిర్మాణాలు తో పాటు రోడ్డు నిర్మాణాలు కూడా ముందుకు సాగుతున్నాయి. రాజధాని నిర్మాణాల వద్ద సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణ పనులను మంత్రి నారాయణ శనివారం పరిశీలించారు. రాజధానిని 16 వ నంబర్ జాతీయ రహదారికి అనుసంధానం చేయడంలో ఈ సీడ్ యాక్సిస్ రోడ్డుకీలకం కానుంది. దీనితో పాటు సీడ్ యాక్సిస్ రోడ్డు లో ఉన్న కొండవీటి వాగు, గుంటూరు చానెల్, బకింగ్ హాం కెనాల్స్ పై నిర్మిస్తున్న బ్రిడ్జిలను కూడా మంత్రి పరిశీలించారు.

గతంలో పెనుమాక,ఉండవల్లిలో ల్యాండ్ పూలింగ్ కు రైతులు కొంత భూమి ఇవ్వకపోవడంతో ఈ రోడ్డు పనులు నిలిచిపోయాయి. ఇప్పుడు పనులు వేగవంతం చెయ్యాలని రోడ్డు పనుల పూర్తికి ఆటంకంగా ఉన్న ప్రాంతాలను మంత్రి సందర్శించారు. అక్కడ రైతులు అధికారులతో నారాయణ మాట్లాడారు.

విజయవాడ నుంచి రాజధానికి కరకట్ట మీదుగా వెళ్లే అవసరం లేకుండా త్వరితగతిన సీడ్ యాక్సిస్ రోడ్డు పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

కొండవీటి వాగు ఎత్తిపోతల వద్ద జరుగుతున్న స్టీల్ బ్రిడ్జి నిర్మాణం వేగవంతం చేయాలని కూడా మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు.

రాజధానిని 16 వ నంబర్ జాతీయ రహదారికి త్వరితగతిన అనుసందానం చేయాలి - మంత్రి నారాయణ - Tholi Paluku