
రాజకీయాల్లో వర్గాల్లో సంచలనం రేపుతున్న సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్
భారత రాజకీయ వర్గాల్లో బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి ఎక్స్ లో చేసిన ట్వీట్ దుమారం రేపుతోంది. అందులో ఆయన సొంత పార్టీపైనే సంచలన ఆరోపణలు చేశారు. ‘అమెరికాలో కొందరు ప్రముఖ భారతీయ రాజకీయ నేతలు అక్రమ లైంగిక కార్యకలాపాల్లో పాల్గొన్నారనే అంతర్జాతీయ స్థాయి సెక్స్ స్కాండల్ వార్తలు దేశ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ఈ ఘటనలో పాల్గొన్న వారిలో దాదాపు 5 సార్లు లోక్ సభ/రాజ్యసభకు ఎంపీలుగా ఎన్నికైన బీజేపీకే చెందిన కొంతమంది సీనియర్ నేతల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అగ్ర నాయకత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. సమాచారం ప్రకారం ఈ ఫోటోలు రానున్న రోజుల్లో అమెరికాకు చెందిన ప్రముఖ వార్తాపత్రికలు (న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ వంటివి) ప్రచురిస్తే భారత రాజకీయాలపై తీరని మచ్చ తప్పదని, ముఖ్యంగా బీజేపీ ఇమేజ్‌కు భారీ దెబ్బ తగులుతుందని పార్టీ హైకమాండ్ భయపడుతోంది.
