Let's talk: editor@tmv.in
రాహుల్ గాంధీ సంచలన ట్వీట్

రాహుల్ గాంధీ సంచలన ట్వీట్

Pinjari Chand
19 సెప్టెంబర్, 2025

కాంగ్రెస్​ అగ్రనేత, లోక్ సభ విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. నేపాల్ తరహాలో ఇండియాలో కూడా జెన్​-జెడ్​ ఉద్యమం వస్తుందని జోస్యం చెప్పారు. ఇండియాలో నిరుద్యోగం, అన్ని వ్యవస్థల్లో అవినీతి, మత విద్వేషాలు, ఓట్ చోరీ, తదితర అంశాలపై విద్యార్థులు, యువత, ప్రజలు తిరగబడటం ఖాయమని హెచ్చరించారు. అయితే యువతతో కలిసి దేశంలో మార్పు కోసం తాను కూడా రోడ్డెక్కుతానని ప్రకటించారు. ప్రస్తుతం మనందరి కర్తవ్యం రాజ్యాంగాన్ని కాపాడటమే ప్రాధాన్యమని తెలిపారు. దేశ యువత ముందుకు రావాలని అన్యాయాలను, అవినీతిని చూస్తూ ఉంటే భవిష్యత్ లో జీవనం కొనసాగించడం కష్టమని వివరించారు. దేశం పేరుతో అనేక అక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు.

అయితే ఈ ట్వీట్ పై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. దేశంలో ఇది సాధ్యం కాదని, అంతా ఐక్యతతో ఉండి బీజేపీని పారద్రోలాలని ఒకరు, ప్రజాస్వామంలో అందరూ తలుచుకుంటే సాధ్యం కానిదంటూ ఏదీ లేదని మరొకరు, దేశ సమగ్రతను కాపాడాలని అల్లర్లు చెలరేగడం వల్ల భారతదేశానికి ఉన్న పేరు, ప్రతిష్టలు దెబ్బతింటాయంటూ ఇంకొకరు, ఇలా అనేక మంది నెటిజన్లు కామెంట్లు చేశారు. అయితే అంతకంటే ముందు ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. 2023 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి బలమున్న నియోజకవర్గాల్లో ఓట్లు తొలగించారని ఆరోపించారు. ఈ సందర్భంగా కర్ణాటకలోని అలంద్​ నియోజకవర్గంలో సుమారు ఆరువేల ఓట్లను తొలగించారని ఆరోపించారు.

రాహుల్ గాంధీ సంచలన ట్వీట్ - Tholi Paluku