Let's talk: editor@tmv.in
రాంలీలా వేడుకలకు సుప్రీం కోర్టు అనుమతి

రాంలీలా వేడుకలకు సుప్రీం కోర్టు అనుమతి

Pinjari Chand
26 సెప్టెంబర్, 2025

ఫిరోజాబాద్‌లోని పాఠశాల మైదానంలో రాంలీలా వేడుకలు నిర్వహించుకోవడానికి సుప్రీం కోర్టు గురువారం అనుమతినిచ్చింది. పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరుపుకోవాలని సూచించింది. జస్టిస్‌ సూర్యకాంత్, ఉజ్జల్ భూయాన్, ఎన్ కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. రాంలీలా వేడుకలను నిలిపివేయాలని అలహాబాద్ హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఉత్తర్వులను తోసిపుచ్చింది.

ఫిరోజాబాద్​ తుండ్లా జిల్లా పరిషత్​ పాఠశాలలో ‘శ్రీనగర్ రాంలీలా ​ మహోత్సవ్​’ రాంలీలా వేడుకలను నిర్వహించుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంది. అయితే ఈ ఏర్పాట్లు శాశ్వతంగా ఉండేలా అక్కడ టైల్స్​ ను, వివిధ పనులను ప్రారంభించింది. అయితే పిటిషనర్​ భవిష్యత్​ లో పిల్లలు ఆడుకోవడానికి ఇబ్బంది అవుతుందని, ప్రస్తుత కార్యక్రమాల వలన చదువులపై ప్రభావం పడుతుందని హైకోర్టు లో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీంతో హైకోర్టు దీనిపై స్టే విధించింది. దీంతో నిర్వాహకులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

రాంలీలా వేడుకను సుమారు వంద సంవత్సరాలుగా అక్కడే నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడెందుకు కోర్టును ఆశ్రయించారు. ముందుగానే పరిపాలన అనుమతులు అడగకుండా మిమ్మల్ని ఏది అడ్డుకుంది. మీరేమి విద్యార్థులు కాదు. అక్కడ ఉండే పిల్లలకు తల్లిదండ్రులు కారు. మీరు ఆ ఆస్థికి యాజమానులు కాదు. అలాంటప్పుడు ఎందుకు పిల్​ వేయలేదని హైకోర్టులో పిటిషన్ వేసిన పిటిషనర్​ ​ను ప్రశ్నించింది. పాఠశాల మైదానాన్ని ఇన్ని సంవత్సరాలుగా రాంలీలా ఉత్సవాలకు ఉపయోగిస్తున్నారనే విషయాన్ని కూడా ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. "ఉత్సవాలు ప్రారంభమైనందున కొన్ని షరతులకు లోబడి నిర్వహించుకోవచ్చని ఆదేశాలిచ్చింది. భవిష్యత్​ లో పాఠశాల మైదానాన్ని ఎలాంటి ఉత్సవాలకు వినియోగించుకోరాదని, జిల్లా యంత్రాంగం ఉత్సవాలకు ప్రత్యామ్నాయ స్థలాన్ని గుర్తించి సమస్యను పరిష్కరించాలని కోర్టు పేర్కొంది. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.

రాంలీలా వేడుకలకు సుప్రీం కోర్టు అనుమతి - Tholi Paluku