Let's talk: editor@tmv.in
రాయ్​పూర్​ లో న్యూడ్​ పార్టీ కలకలం

రాయ్​పూర్​ లో న్యూడ్​ పార్టీ కలకలం

Pinjari Chand
15 సెప్టెంబర్, 2025

కాలంతో పాటు మనుషుల్లో వింత పోకడలు ఎక్కువయ్యాయి. కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ జీవితాన్ని దుర్భరం చేసుకుంటున్నాడు. టెక్నాలజీతో పాటు మనషుల ప్రవర్తన కూడా మారుతోంది. అందుబాటులోకి వచ్చిన సౌకర్యాలతో మనిషి విచ్చలవిడి ఆశ్లీలతను ఆశ్రయిస్తున్నాడు. దేశంలో ఎప్పుడు వినని పార్టీల పేర్లు వింటున్నాం. రకరకాల థీమ్ లతో నిర్వాహకులు యువతను ఆకర్షిస్తున్నారు. రేవ్​ పార్టీలని, సన్​ బర్న్​ అని రకరకాలుగా పిలుచుకుంటున్నారు. ఆ పార్టీల అంతిమ లక్ష్యం అమ్మాయిలతో సుఖం పొందడమే. తాజాగా అలాంటి ఓ ప్రోగ్రామ్​ ను రాయ్​ పూర్​ లో నిర్వహించాలనుకున్నారు. కానీ ఆ కార్యక్రమ పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చి భగ్నం చేశారు.

క్లబ్​ లో న్యూడ్​ పార్టీ

ఈ పార్టీకి రావాలని కొంతమంది సోషల్ మీడియాలోని ప్రైవేట్ గ్రూపుల్లో ఇన్విటేషన్​ పంపారు. అయితే వచ్చేవారు ఖచ్చితంగా ఈ పార్టీలో బట్టలు లేకుండా నగ్నంగా ఉండాలని షరతు విధించారు. అలాగే ఒక బాటిల్​ మందు కొంటే మరో బాటిల్​ ఉచితం అని ఆఫర్​ పెట్టారు. అయితే ఇది కాస్తా బయటకు పొక్కడంతో పోలీసులు 6 మందిని అరెస్ట్​ చేశారు. ఈ పార్టీ ఈ నెల 21 న జరగాల్సి ఉంది. అంతలోపే పోలీసులు ట్రేస్​ చేయడంతో అ సాంఘిక కార్యక్రమానికి అడ్డువేశారు.

ఈ కార్యక్రమం విషయంలో అధికార బీజేపీ, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్​ దుమ్మెత్తిపోసుకున్నాయి. రాష్​ట్రాన్ని గబ్బుపట్టించారని కాంగ్రెస్​ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కన్హయ్య అగర్వాల్ ఆరోపించారు. అశ్లీలతను ప్రోత్సాహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరాయి. అలాగే సత్వర చర్యలు తీసుకోవాలని ఒక మెమరండాన్ని అందించాయి. ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దని కాంగ్రెస్​ నాయకులను బీజేపీ నాయకులు కోరారు. అయితే ఇటువంటి విషయాలను రాజకీయం చేయడంలో కాంగ్రెస్​ దిట్ట అని ఆ రాష్ట్ర మంత్రి శ్యామ్​ బీహర్​ జైస్వాల్​ విమర్శించారు. ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించకూడదని దీని వెనుక ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో కార్యక్రమాన్ని నిర్వహించతలపెట్టిన హైపర్​ క్లబ్​ పై దాడి చేసి నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే న్యూడ్​ పార్టీ, స్ట్రేంజర్ హౌస్ పార్టీ లకు సంబంధించిన వారిని కూడా అరెస్ట్​ చేస్తామని ఎస్పీ లాల్​ ఉమేద్​ సింగ్​ వివరించారు. పార్టీలో జాయిన్​ కావాలనుకుని రిజిస్ట్రేషన్​ చేసుకున్న జంటలను కూడా విచారిస్తామని తెలిపారు.

రాయ్​పూర్​ లో న్యూడ్​ పార్టీ కలకలం - Tholi Paluku