Let's talk: editor@tmv.in
రాయదుర్గం భూముల వేలానికీ సర్కార్ రెడీ

రాయదుర్గం భూముల వేలానికీ సర్కార్ రెడీ

Gaddamidi Naveen
17 సెప్టెంబర్, 2025

హైదరాబాద్ పరిధిలో ఉండే రాయదుర్గం భూములు ఆదాయ వనరుగా మారానున్నాయి. వాస్తవానికి ఇది ఐటీ, బిజినెస్, వాణిజ్య రంగాల అభివృద్ధికి అనుకూలంగా ఉండే ప్రదేశం కావడంతో భూముల ధరలు భారీగా పెరుగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం, ఆర్థిక లోటును తగ్గించేందుకు, వచ్చే నేలలో భూముల ఈ‑వేలంలో భూముల ధరలు ఆకాశాన్ని తాకే అవకాశముందని రియల్ ఎస్టేట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం రిజర్వ్ ధరను ఎకరానికి రూ.101 కోట్లుగా నిర్ణయించింది. అయితే ఈ ధర వేలంలో ఎకరానికి కనీసం రూ.150 కోట్లకు చేరుతుందని, అంతకంటే ఎక్కవ పలికే అవకాశమూ ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

రాయదుర్గం భూముల ధరలు కోకాపేట లేదా ఇతర ప్రాంతాల ధరను మించే అవకాశముందని అంటున్నారు. రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోని సర్వే నంబర్ 83/1 లో ప్లాట్ నంబర్ 19లో 11 ఎకరాలు, ప్లాట్ నంబర్ 15A/2 లో 7.67 ఎకరాలు కలిపి మొత్తం 18.67 ఎకరాలను ప్రభుత్వం వేలం వేయనుంది. ఈ వేలం కోసం రిజిస్ట్రేషన్ ఫీజును రూ.1,180గా బిడ్ డాక్కమెంట్ ఫీజును ఒక్కో ప్లాట్ కు రూ.10 లక్షలుగా నిర్ణయించింది. బిడ్ దాఖలు చేసేందుకు గడువు అక్టోబర్ 1 సాయంత్రం 5 గంటల,వరకు ల్యాండ్ విజిటింగ్ కి అక్టోబర్ 4 వరకు అవకాశం కల్పించారు. ఈ వేలం అక్టోబర్ 6న మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగనుంది. ఈ వేలం ద్వారా ప్రభుత్వానికి రూ.2,000 కోట్లకు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచానా వేస్తున్నారు.

రాయదుర్గం భూముల వేలానికీ సర్కార్ రెడీ - Tholi Paluku