
రాజకీయ తెరపై సినిమా బొమ్మ హిట్టవుతుందా?
పాతాళానికి తొక్కివేశారన్నది ఇటీవల వచ్చిన పార్టీల స్థితిగతులను పరిశీలిస్తే
దేశీయ ముర్పొక ద్రవిడ కళగం(డీఎండీకే)
ద్రవిడ సిద్దాంతాలు, సామాజిక న్యాయం, అవినీతి వ్యతిరేక పోరాటం, తమిళ ప్రజల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా నటుడు విజయ్ కాంత్ 2005లో డీఎండీకేను స్థాపించారు. ఈ పార్టీ స్థాపించే నాటికి విజయ్ కాంత్ ను తమిళనాడులో ‘కప్టెన్’ అనే పేరుతో పిలిచే వారు. ఆయనకు యువతలో, పట్టణాల్లో, గ్రామాల్లో చాలా ఇమేజ్ ఉండేది. అభిమానులు విశేషంగా ఆదరించేవారు. పార్టీ స్థాపించిన తరువాత కూడా అభిమానులు అశేషంగా తరలివచ్చి మద్దతు ప్రకటించారు. మరుసటి ఏడాది (2006) జరిగిన ఎన్నికల్లో డీఎండీకే దాదాపు 232 స్థానాల్లో పోటీ చేసింది. కానీ విరుద్ నగర్ నుంచి పార్టీ వ్యవస్థాకుడు విజయ్ కాంత్ మాత్రమే గెలిచారు. దీంతో ఆయన అభాసుపాలయ్యారు. అనంతరం కూటమిగా జత కట్టి 2011 ఎన్నికల్లో సుమారు 29 స్థానాల్లో గెలిచింది. విజయ్ కాంత్ కూడా ప్రజా సంగ్రామ యాత్రల పేరుతో రాష్ట్ర పర్యటనలు చేపట్టారు. విశేషంగా ప్రజలు సభలకు తరలివచ్చారు. కానీ ఓట్ల విషయానికి వచ్చేవరకు అదరణ లభించలేదు.
ఆల్ ఇండియా సమతువా మక్కల్ కచ్చి (ఏఐఎస్ఎంకే)
2007లో డీఎంకే నుంచి బయటకు వచ్చి సామాజిక సమానత్వం, విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత, యువతకు ఉద్యోగావకాశాలు, పేద, వెనుకబడిన వర్గాల అభివృద్ధి కొసమంటూ ప్రముఖ నటుడు శరత్ కుమార్ ఏఐఎస్ఎంకే పార్టీనిస్థాపించారు. అప్పటి రాజకీయ కారణాల వల్ల ఆయనకూ అభిమానుల నుంచి మద్దతు బాగానే లభించింది. ఆ సమయంలో సినిమాల పరంగా కూడా ఉన్నత దశలో ఉన్నారు. 2011లో జరిగిన శాసనసభ ఎన్నికల కంటే ముందు తమిళనాడులోని జిల్లాల్లో, గ్రామాల్లో అవినీతి వ్యతిరేక యాత్రలు చేశారు. రాజకీయంగా బలపడటానికి యువతను కూడా ర్యాలీలు చేశారు. అయితే తదుపరి జరిగిన ఎలక్షన్లలో కూటమితో జతకట్టడం వల్ల కేవలం 23 స్థానాల్లోనే పోటీ చేశారు. అందులో రెండు స్థానాలను మాత్రమే గెలుచుకున్నారు. హీరో అయినప్పటికీ ఎన్నికల్లో పోటీ చేయడానికి కనీసం అభ్యర్థులు లేక ఏఐడీఎంకేతో పోటీ చేసే స్థానాల కోసం పట్టుబట్టలేదు. ర్యాలీలు అశేషంగా తరలివచ్చిన ప్రజలు ఎన్నికల సమయానికి ముఖం చాటేశారు.
మక్కల్ నీధి మయ్యం (ఎంఎన్ఎం)
విలక్షణ నటుడు కమల్ హసన్ కూడా మక్కల్ నీదిమయ్యం పేరుతో 2018లో పార్టీ స్థాపించారు. కానీ తదనంతరం జరిగిన 2019 లోక్ సభ ఎన్నికల్లో బొక్కబోర్ల పడ్డారు. ఒక్కటంటే ఒక్కసీటు కూడా గెలవలేకపోయారు. రైటిస్ట్, లెఫ్టిస్ట్ కాకుండా మధ్యే మార్గంగా స్థాపించిన పార్టీ 2021 ఎన్నికల్లో తమిళనాడులో పోటీచేసినప్పటికీ అక్కడ నిరాశే ఎదురైంది. పార్టీ ప్రారంభంలో పెద్ద ఎత్తున రాజకీయ చర్చలకు తెరతీసింది. కానీ ఎలక్షన్ల నాటికి సేమ్ సీన్ రిపీటైంది.
తెలుగునాట హీరోల పరిస్థితి ఇంతే
తెలుగునాట కూడా ఇదే పరిస్థితి ఉంది. 2008లో మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. సామాజికన్యాయం పేరుతో ప్రజల్లోకి వెళ్లారు. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో బస్సు యాత్ర నిర్వహించారు. ఈ యాత్రలకు అశేషంగా జనవాహిని తరలివచ్చింది. ఆయన ప్రసంగాలకు ప్రజలు జేజేలు పలికారు. ఎక్కడ పోయిన అభిమాన వర్షం కురిపించారు. ఆయన సభలకు,ర్యాలీలకు భారీ ఎత్తున ప్రజానీకం తరలివచ్చింది. ఇసుకేస్తే రాలనంతగా పార్టీ సభలకు క్యూకట్టారు. 2009 లో ప్రజారాజ్యం ప్రభంజనం సృష్టిస్తుందని అంతా అనుకున్నారు. 294 శాసనసభ స్థానాల్లో పోటీ చేశారు. కానీ 18 స్థానాల్లో మాత్రమే విజయం సాధించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అలాగే ఆయన తమ్ముడు పవన్ కల్యాణ్ 2014లో జనసేన పార్టీని స్థాపించారు. కానీ తదుపరి ఎన్నికల్ల పోటీ చేయలేదు. కానీ 2019లో జరిగన ఎన్నికల్లో ఏపీలోని 175 నియోజక వర్గాల్లో పోటీ చేశారు. ఒక్క సీటు కూడా గెలవలేదు. పార్టీస్థాపకుడు పవన్ కల్యాణ్ కూడా రెండు స్థానాల్లో పోటీచేస్తే రెండు స్థానాల్లోనూ ఒడిపోయారు. 2024 ఎన్నికల్లో పొత్తుపెట్టుకుని 21 స్థానాల్లో గెలిచారు. పవన్ కల్యాణ్ సభలకు, ప్రచార ర్యాలీలకు జనం తుపానులా తరలివచ్చేవారు. కానీ ఓట్ల విషయానికి వచ్చేవరకు పెద్దగా జనసేనను ఆదరించలేదు.
నటులకు సినిమాల్లో క్రేజ్ ఉంది. దాన్ని రాజకీయంగా మలుచుకోవాలంటే ప్రస్తుతం ఉన్న నటులు సాధ్యం కావడం లేదు. పార్టీ పెట్టి విజయం సాధించిన నేతలు ఎంజీఆర్, అన్నాదురై, ఎన్టీఆర్ మినహ సినీనటులు ఎవరూ రాజకీయాలపై తమదైన ముద్ర వేయలేకపోయారు. పార్టీ పెట్టిన ప్రతి ఒక్కరూ గొప్ప, గొప్ప ఆదర్శాలు మాట్లాడినప్పటికీ వాస్తవంలోకి వచ్చేసరికి ప్రజలను దూరం పెడుతుండడమే హీరోల ఫెయీల్యూర్కి ప్రధానం కారణం కావచ్చు. ప్రస్తుతం విజయ్ కూడా తమిళ వెట్రి కళగం స్థాపించి బస్సుయాత్రను ప్రారంభించారు. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కానీ 2026 జరిగే ఎన్నికల్లో కూడా ఈ విధమైన మద్దతు ఉంటుందా అన్నదే ప్రశ్నార్థకం.
