Let's talk: editor@tmv.in
రక్షణ రంగాల్లో సహకరించుకుంటాం

రక్షణ రంగాల్లో సహకరించుకుంటాం

Pinjari Chand
10 అక్టోబర్, 2025

భారత్ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆస్ట్రేలియాలో అధికారికంగా పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య రక్షణ సంబంధాలను మెరుగుపరచుకోవడానికి కీలక ఒప్పందాలపై ఇరుదేశాల సీనియర్ రక్షణ అధికారుల సమక్షంలో సంతకాలు చేసుకున్నారు. ఈ ఒప్పంద కార్యక్రమంలో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆస్ట్రేలియా ఉప ప్రధాని, రక్షణ మంత్రి రిచర్డ్ మార్ల్స్ పాల్గొన్నారు. గురువారం రాజ్‌నాథ్ సింగ్‌కు పార్లమెంట్ హౌస్‌లో ఘనస్వాగతం పలికారు. రాజ్‌నాథ్ సింగ్ అస్ట్రేలియా పార్లమెంట్ హౌస్‌లోప్రధాని ఆంథోనీ ఆల్బనీస్, మార్ల్స్‌తో సమావేశమయ్యారు. రెండు దేశాలు ఈ సమావేశాలను కీలకంగా తీసుకున్నాయి. భవిష్యత్‌లో వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ఈ చర్చలు అవశ్యకంగా మారాయి.

రిచర్డ్ మార్ల్స్ ఈ సమావేశాలను అత్యంత ముఖ్యమైన సందర్భంగా అభివర్ణించారు. ఈ ఒప్పందం భారత–ఆస్ట్రేలియా రక్షణ బలాలను మరింత పెంచుకునేందుకు, పరస్పర విశ్వాసాన్ని పెంపొందించడానికి, ఆపరేషనల్ కమాండ్ల మధ్య ‘స్టాఫ్ టాక్’ వ్యవస్థను సృష్టించడానికి ఉపయోగపడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

గత ఒప్పందాలు

భారత–ఆస్ట్రేలియా మధ్య రక్షణ సంబంధాలు గడచిన కొన్ని సంవత్సరాల్లో మెరుగుపడ్డాయి. ముఖ్యంగా

• 2014 – LEMOA (Logistics Exchange Memorandum of Agreement)

ఇరుదేశాల సైనిక దళాల మధ్య లాజిస్టిక్స్, ఇంధన సరఫరాల సహకారం కోసం ఒప్పందాలు కుదుర్చుకున్నారు.

• 2016 – COMCASA (Communications Compatibility and Security Agreement)

ఇది రక్షణ సమాచార మార్పిడి, సాంకేతిక కమ్యూనికేషన్ సామర్థ్యాలను బలోపేతం చేసేందుకు రూపొందించారు.

భారత–ఆస్ట్రేలియా నౌకాశ్రయాలు, ఏరోనాటికల్, రాకెట్ టెక్నాలజీ విభాగాల్లో సమాచార భాగస్వామ్యానికి తెర తీసింది.

• 2020 – Basic Exchange and Cooperation Agreement (BECA)

ఇరు దేశాల మధ్య భౌగోళిక, సైనిక రాడార్ డేటా మార్పిడి కోసం అప్పట్లో ఒప్పందం జరిగింది.

ఈ సమావేశాల్లో భారత్–ఆస్ట్రేలియాల మధ్య రక్షణ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం, సముద్ర భద్రతలో సహకారం పెంపొందించడం, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సంయుక్త కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లడం వంటి తదితర అంశాలపైన చర్చలు జరిగాయి. ఇరుదేశాల్లో శాంతి, స్థిరత్వం నియమాల ఆధారిత వ్యవస్థను కాపాడేందుకు కట్టుబడి ఉన్నట్లు ప్రతిపాదించారు.

అమరులకు నివాళి

స్వేచ్ఛా భావం, ప్రజాస్వామ్య విలువల రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన వీరులను స్మరించుకునే ఈ ప్రదేశం, భారత్‌–ఆస్ట్రేలియా దేశాలు మన్నించే ధైర్యం, త్యాగానికి చిహ్నంగా ఉన్నాయి. దూర ప్రాంతాల్లో ఆస్ట్రేలియన్ సైనికులతో కలిసి ధైర్యంగా యుద్ధం చేసిన భారత సైనికుల స్మృతికి గౌరవం వందనం సమర్పిస్తున్నాను. వారి త్యాగం ధైర్యం, విధుల పట్ల అంకితభావానికి ప్రతీకగా నిలుస్తుంది. భారతదేశం, ఆస్ట్రేలియా పంచుకున్న విలువలు, చరిత్ర ద్వారా శాశ్వతంగా కలిపే ఒక స్ఫూర్తిదాయక వారసత్వం’అని కాన్‌బెరాలోని ఆస్ట్రేలియన్ వార్ మెమోరియల్‌లో కేంద్రమంత్రి రాజ్​ నాథ్ సింగ్ నివాళులు అర్పించారు.

రక్షణ రంగాల్లో సహకరించుకుంటాం - Tholi Paluku