Let's talk: editor@tmv.in
రంగారెడ్డి జిల్లాలో 'త్రయ' ప్రైవేట్ పాఠశాలను ప్రారంబించిన మంత్రి కోమ‌టిరెడ్డి

రంగారెడ్డి జిల్లాలో 'త్రయ' ప్రైవేట్ పాఠశాలను ప్రారంబించిన మంత్రి కోమ‌టిరెడ్డి

Gaddamidi Naveen
19 నవంబర్, 2025

రంగారెడ్డి జిల్లాలోని జన్వాడ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రైవేట్ విద్యాసంస్థ అయిన త్రయ స్కూల్ ను అధికారికంగా ఈ పాఠశాల వ్యవస్థాపకులు మీను తలసిల, భరత్ పావులూరి , మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన వాల్‌డార్ఫ్ విద్యా విధానాన్ని అనుసరించి రూపుదిద్దుకున్న ఈ విద్యాసంస్థ, పిల్లలలో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, భావోద్వేగ వంటి అంశాలను అభివృద్ధి చేయడాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుందని ఆయ‌న అన్నారు. పుస్తకాల బోధనకు అతీతంగా, అనుభవాధారిత శిక్షణ, కళల సమన్వయం, స్వతంత్ర ఆలోచనల పెంపు వంటి విద్యా విధానాలను ఈ పాఠశాల ప్రత్యేకంగా అందించబోతోందని ఆయ‌న తెలిపారు.

ఆధునిక బోధనతో పాటు బలమైన విలువల కలయికతో విద్యను అందించే విద్యా సంస్థలు మన పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు చాలా అవసరం అని ఉద్ఘాటించారు. కేవలం అకడమిక్ అంశాలపైనే కాకుండా, పిల్లల వ్యక్తిత్వ వికాసానికి, జీవిత నైపుణ్యాలకు ప్రాధాన్యత ఇవ్వడం వలన వారు భవిష్యత్తు సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోగలరని ఆయ‌న‌ తెలిపారు.కొత్త తరహా బోధనా విధానాలను అందించే సామర్థ్యం ఈ పాఠశాలకు ఉందని,తద్వారా, రాబోయే రోజుల్లో విద్యా రంగంలో త్రయ స్కూల్ ప్రత్యేక స్థానాన్ని సంపాదిస్తుందని ఆయ‌న‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కొత్త విద్యా ప్రయాణంలో త్రయ స్కూల్ టీమ్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

వాల్దార్ఫ్ విధానం అంటే ఏమిటి?

సాంప్రదాయ విద్యకు భిన్నంగా, పిల్లల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా రూపొందించబడిన ప్రత్యేక బోధనా పద్ధతి వాల్‌డార్ఫ్ విద్యా విధానం. ఆస్ట్రియన్ తత్వవేత్త, సామాజిక సంస్కర్త రూడాల్ఫ్ స్టెయినర్ 1919లో ఈ విధానాన్ని స్థాపించారు. ఇది కేవలం మేధోపరమైన జ్ఞానానికే పరిమితం కాకుండా, పిల్లల వ్యక్తిత్వాన్ని పూర్తిగా వికసించేలా చేస్తుంది.వాల్‌డార్ఫ్ విద్యా విధానం పిల్లల అభ్యాసాన్ని మూడు కీలక అంశాలపై సమానంగా దృష్టి పెడుతుంది. విమర్శనాత్మక ఆలోచన, విశ్లేషణ, మేధోపరమైన అభ్యాసం.హృదయం, భావోద్వేగాల ఎదుగుదల, కళలు, సంగీతం, సామాజిక అవగాహన.చేతులు శారీరక శ్రమ, చేతి పనులు, క్రీడలు, ఆచరణాత్మక నైపుణ్యాలు.ఈ మూడు అంశాల మధ్య సమతుల్యత సాధించడం ద్వారా పిల్లలు జీవితాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తిని పొందుతారు అని పేర్కొన్నారు.త్రయ స్కూల్ అధికారిక వెబ్‌సైట్ thrayaschool.com/admission.ద్వారా అప్లై చేసుకోవ‌చ్చు అని తెలిపారు.