Let's talk: editor@tmv.in
యూపీలో పర్యటించిన నితిన్ నబిన్

యూపీలో పర్యటించిన నితిన్ నబిన్

Pinjari Chand
26 జనవరి, 2026

ఎన్నికల సమయంలో దేశాన్ని విభజించే, రాజ్యాంగాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేసే శక్తులు ఏర్పడుతాయని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నూతన రాష్ట్ర అధ్యక్షుడు నితిన్ నబిన్ హెచ్చరించారు. ఆదివారం పార్టీ కార్యకర్తలకు 2027 అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమయ్యేలా ఆయన ఉపన్యసించారు. బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తన మొదటి పర్యటనో నబిన్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ని రాష్ట్రంలో సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించినందుకు అభినందించారు. ఉత్తర ప్రదేశ్ ఇప్పుడు దేశ అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతుందని ఆయన చెప్పారు. నబిన్ పార్టీ కార్యకర్తలను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ రాష్ర్టంలో 2027 ఎన్నికలు జరగనున్నాయని, అసెంబ్లీ ఎలక్షన్లు దగ్గర వచ్చాయని, ఎల్లప్పుడూ ఎన్నికల సమయంలో విభజన, అన్యాయ చర్యలతో ఉన్న శక్తులను ఎదుర్కోవలసి ఉంటుందని అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయో, అప్పుడు దేశాన్ని విభజించడానికి, రాజ్యాంగాన్ని అవమానించడానికి శక్తులు బయటకు వస్తాయి. మనం వాటిని రాజకీయంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. సకాలంలో బూత్లను బలోపేతం చేసుకోవాలని కార్యకర్తలకు సూచించారు. అలాగే మన్ కీ బాత్ ప్రజా కార్యక్రమాలు ప్రతి బూత్‌లో నిర్వహిస్తారని పేర్కొన్నారు.

నబిన్ బీజేపీ ప్రభుత్వ విజయాలకు పార్టీ కార్యకర్తల సహకారానికి కృతజ్ఞతలు తెలిపి ప్రతి రాష్ట్రం ప్రగతి మార్గంలో ఉందని, ప్రత్యేకంగా ఉత్తర ప్రదేశ్ ఇప్పుడు అభివృద్ధి మార్గంలో ముందున్నదని అన్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, నబిన్ కు మథురలో స్వాగతం పలికారు. ఆయనతో కలిసి నబిన్ శ్రీ వ్రిందావన్ చంద్రోదయా దేవాలయాన్ని సందర్శించి ప్రధాని ప్రసంగం విన్నారు. నబిన్ రాష్ట్రంలోని సంస్కృతి, అభివృద్ధి, మౌలిక సదుపాయాలపై ప్రశంసలు కురిపించారు. ప్రత్యేకంగా యమునా ఎక్స్‌ప్రెస్‌వే అభివృద్ధి, పౌర సంక్షేమ కార్యక్రమాలు ప్రజలలో బీజేపీపై నమ్మకాన్ని పెంచుతున్నాయని ఆయన చెప్పారు.