Let's talk: editor@tmv.in
యూపీఎస్సీ ఈఎస్ఈ 2026 నోటిఫికేషన్ విడుదల

యూపీఎస్సీ ఈఎస్ఈ 2026 నోటిఫికేషన్ విడుదల

Shaik Mohammad Shaffee
28 సెప్టెంబర్, 2025

భారత ప్రభుత్వంలో గ్రూప్ 'ఏ' టెక్నికల్ పోస్టుల్లో చేరాలని లక్ష్యంగా పెట్టుకున్న ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) శుభవార్త అందించింది. ప్రతిష్టాత్మకమైన ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (ఈఎస్ఈ) 2026 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా రైల్వే, టెలికాం, డిఫెన్స్‌ సర్వీస్‌ తదితర కేంద్ర ప్రభుత్వ విభాగాలు, శాఖల్లో 474 ఇంజినీరింగ్‌ పోస్టులు భర్తీ చేయనుంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 16. సివిల్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలీకమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రిలిమ్స్ పరీక్షను దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 8, 2026న (ఆదివారం) నిర్వహించనున్నారు.

కాగా ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/విద్యా సంస్థ నుంచి సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ (బీఈ/బీటెక్) పూర్తి చేసి ఉండాలి. ఇంజినీర్స్ (ఇండియా) ఇన్‌స్టిట్యూషన్‌లోని సెక్షన్స్ ఏ,బీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు జనవరి 1, 2026 నాటికి 21 సంవత్సరాల కంటే తక్కువ, 30 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. జనరల్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.200గా ఉంది. మహిళా/ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.

ఎంపిక ప్రక్రియ

ఈఎస్ఈ పరీక్ష మొత్తం మూడు దశల్లో జరుగుతుంది. ఈ మూడు దశల్లోని మార్కుల ఆధారంగానే తుది మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. మొదట ప్రిలిమినరీ పరీక్ష 500 మార్కులకు ఉంటుంది. ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలతో కూడిన ఈ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-I: జనరల్ స్టడీస్ & ఇంజినీరింగ్ ఆప్టిట్యూడ్ (200 మార్కులు), పేపర్-II: అభ్యర్థి ఎంచుకున్న ఇంజినీరింగ్ విభాగం (300 మార్కులు) నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ క్లియర్ చేసిన వారికి 600 మార్కులకు మెయిన్స్ పరీక్ష ఉంటుంది. ఇది డిస్క్రిప్టివ్ పరీక్ష. ఇందులో రెండు కోర్ ఇంజినీరింగ్ పేపర్లు ఉంటాయి. ప్రతి పేపర్‌కు 300 మార్కులు కేటాయించారు. మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇది 200 మార్కులకు ఉంటుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రిలిమ్స్ పరీక్షా కేంద్రాలుగా హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి నగరాలు ఉన్నాయి. అయితే మెయిన్స్ పరీక్షకు మాత్రం హైదరాబాద్, విశాఖపట్నం నగరాలే పరీక్ష కేంద్రాలుగా ఉన్నాయి. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ https://upsconline.nic.in/లో ఉన్న నోటిఫికేషన్‌ను చదవండి.

కెరీర్ ఎలా ఉంటుంది?

యూపీఎస్సీ ఈఎస్ఈ ద్వారా ఎంపికైన ఇంజినీర్లు దేశంలోని ప్రతిష్టాత్మక కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో గ్రూప్ 'ఏ' గెజిటెడ్ ఆఫీసర్లుగా చేరతారు. ఇక్కడ లభించే జీతం, గౌరవం, కెరీర్ వృద్ధి అద్భుతంగా ఉంటాయి. కెరీర్ ప్రారంభంలో వీరు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ లేదా అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరతారు. వీరి నెల జీతం అన్ని అలవెన్స్‌లతో కలిపి సుమారు రూ.60,000 నుంచి రూ.80,000 వరకు ఉంటుంది.

ఈ ఇంజినీర్లకు పనితీరు, సర్వీస్ ఆధారంగానూ పదోన్నతులు లభిస్తాయి. 3-4 ఏళ్ల తర్వాత ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్/డైరెక్టర్, 13 ఏళ్ల తర్వాత జాయింట్ జనరల్ మేనేజర్/ చీఫ్ ఇంజినీర్ లెవెల్-2, 20 ఏళ్ల తర్వాత అడిషనల్ జనరల్ మేనేజర్/చీఫ్ ఇంజినీర్, చివరికి మేనేజింగ్ డైరెక్టర్ లేదా కేంద్ర ప్రభుత్వంలో క్యాబినెట్ సెక్రటరీ గ్రేడ్ స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఇండియన్ రైల్వేస్, సీపీడబ్ల్యూడీ, ఎంఈఎస్, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, సెంట్రల్ వాటర్ కమిషన్, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వంటి కీలక ప్రభుత్వ విభాగాల్లో వీరు సేవలు అందిస్తారు.

ఐటీఐలకు అడ్వాన్స్ టెక్నాలజీ: సీఎం రేవంత్ రెడ్డి

వేస్తాం.

తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి

ఏటీసీల్లో శిక్షణ పొందిన తమ్ముళ్లు, చెల్లెళ్లు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి. 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదగడంలో మీ వంతు కృషి చేయాలి. అభివృద్ధిని సాధించాలన్న సంకల్పంతోనే యువతలో సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. రాష్ట్రంలో 1956 లో ప్రారంభమైన ఐటీఐలు, క్రమేణా 65 ఐటీఐలకు పెరిగినప్పటికీ గత ప్రభుత్వాలు వీటిని పట్టించుకోలేదు. మారిన కాలానికి ఈ కేంద్రాలు ఏమాత్రం సంబంధం లేకుండా పాతకాలపు ఒరవడిలో నడిచాయి. వాటిని సమూలంగా మార్చి ఆధునిక పరిస్థితులకు అనుగుణంగా నూతన సాంకేతిక పరిజ్ఞానంతో నైపుణ్యం కలిగిన శిక్షణ అందించాలన్న లక్ష్యంతో గత ఏడాది ఇదే ప్రాంగణంలో ఏటీసీలకు పునాదులు వేసుకున్నాం.

మరో 51 ఏటీసీలను ప్రారంభిస్తాం

టాటా టెక్నాలజీస్ సహకారంతో రాష్ట్రంలో 65 ఐటీఐలను ఏటీసీలుగా మార్చడానికి ప్రభుత్వం కేవలం రూ.300 కోట్లు ఖర్చు చేస్తే టాటా సంస్థ రూ.2100 కోట్లు ఖర్చు చేసి ఆధునిక ఏటీసీలను తీర్చిదిద్దారు. మన వద్ద డబ్బుకన్నా ఆలోచన, చిత్తశుద్ది ఉండాలి. చిత్తశుద్ధి, సంకల్పం ఉంటే సాధ్యం కానిదంటూ ఏమీ లేదన్నారు. ప్రస్తుతం 65 ఏటీసీలకు అదనంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో మరో 51 ఏటీసీలను ప్రారంభిస్తాం. ఈ 116 ఏటీసీలు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తాయి. ఒకప్పుడు ఐటీఐల్లో చదువుకున్న వారికి ఆర్టీసీలో అప్రెంటిస్ చేయడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ అప్రెంటిషిప్ ఇప్పించే ఏర్పాట్లు చేయాలి.

రాష్ట్రంలో ప్రతి ఏటా లక్షా 10 వేల మంది విద్యార్థులు ఇంజనీరింగ్ పట్టా పొందుతున్నప్పటికీ నైపుణ్యం లేని కారణంగా చాలా మందికి ఉద్యోగావకాశాలు రావడం లేదు. నైపుణ్యం లేనిదే ప్రైవేటు కార్పొరేట్ రంగంలో ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. అందుకే స్కిల్స్ పెంచాలన్న అంశంపై ప్రభుత్వం దృష్టి సారించింది. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ లాంటివి ప్రారంభించామంటే మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలన్నదే మా సంకల్పం. చేతుల్లో డిగ్రీలు ఉన్నా స్కిల్స్ లేకపోతే ప్రయోజనం లేదు. నైపుణ్యత కలిగిన వారికి దక్షిణ కొరియా, జర్మనీ, జపాన్, రష్యా లాంటి దేశాల్లో అనేక ఉద్యోగావకాశాలు ఉన్నాయి. కేవలం ఐటీ చదివితేనే ఉద్యోగాలొస్తాయన్న అపోహల్లో బతుకుతున్నాం. అది తప్పు. ఏటీసీల్లో చదువుతున్న యువత నైపుణ్యత సాధించడంపై ఫోకస్ పెట్టాలి. చదువు ఒక్కటే సమాజంలో అసమానతలు రూపుమాపుతుంది. మీకు గౌరవం దక్కుతుంది. చదువు, సాంకేతిక నైపుణ్యం ఒక్కటే మీ తలరాతను మార్చుతుంది. ఈ ప్రభుత్వం మీకు అవకాశాలు, వసతులను ఏర్పాటు చేస్తుంది. చదువుకుని రాణించండి. చదువు లేకపోతే, నైపుణ్యం లేకపోతే ఎందుకూ కొరకాకుండా పోతారు.. అని ఉద్బోధించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, డాక్టర్ మల్లు రవి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గారితో పాటు ఉన్నతాధికారులు, టాటా టెక్నాలజీస్ ప్రతినిధులు, ఏటీసీ విద్యార్థులు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఏటీసీల నుంచి స్థానికంగా ప్రజాప్రతినిధులు, విద్యార్థులు వీడియో కాన్ఫరెన్సింగ్ విధానంలో ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. విదేశీ పర్యటనలో ఉన్న మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన సందేశాన్ని వినిపించారు.

యూపీఎస్సీ ఈఎస్ఈ 2026 నోటిఫికేషన్ విడుదల - Tholi Paluku