Let's talk: editor@tmv.in
యువత, మహిళా వ్యాపార అభివృద్ధికి టీ.ఐ.ఈ. గ్లోబల్ సమ్మిట్

యువత, మహిళా వ్యాపార అభివృద్ధికి టీ.ఐ.ఈ. గ్లోబల్ సమ్మిట్

Laaheerie P
30 అక్టోబర్, 2025

2025లో టి.ఐ.ఈ గ్లోబల్ సమ్మిట్ ‘ఇన్‌క్లూసివిటీ’ ,‘కోలాబరేషన్’ను ప్రధానంగా యువత, మహిళా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ను కేంద్రంగా చేసుకుంది. టి.ఐ.ఈ ఫ్లాగ్‌షిప్ కాంపిటీషన్‌లు టి.ఐ.ఈ గ్లోబల్ ఫైనల్స్ , స్టూడెంట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ 2025 (దిల్లీ ఎన్‌సిఆర్ చాప్టర్ ఆధ్వర్యంలో)భారత్, విదేశాల్లోని 50కి పైగా విద్యాసంస్థల నుంచి 400 మందికి పైగా విద్యార్థులను ఒక వేదికపైకి తీసుకువచ్చాయి. ఉత్తమ బిజినెస్ మోడల్, టీమ్‌వర్క్, ఎగ్జిక్యూషన్ కేటగిరీల్లో అవార్డులు ప్రధానం చేయగా, టి.ఐ.ఈ సియాటిల్, దిల్లీ ఎన్‌సిఆర్, రాజస్థాన్, హౌస్టన్ చాప్టర్ల టీమ్‌లు గ్లోబల్ ఫైనల్స్‌కు అర్హత సాధించాయి. ఇది టి.ఐ.ఈ గ్లోబల్ నెట్‌వర్క్ విస్తృతిని మరోసారి నిరూపించింది.

మహిళా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ విభాగంలో పూణేకు చెందిన గ్లోవాట్రిక్స్ (ఏఐ ఆధారిత వేరబుల్ టెక్ స్టార్టప్) విజేతగా నిలిచింది. ఇది 2026లో జైపూర్‌లో జరిగే గ్లోబల్ ఫైనల్‌లో భారత చాప్టర్‌కు ప్రాతినిధ్యం వహించనుంది. సమ్మిట్‌లో నిర్దిష్ట పెట్టుబడి గణాంకాలు వెల్లడించకపోయినా, ఇంటర్ చాప్టర్ కోలాబరేషన్లు, యువత, మహిళలు, డీప్ టెక్ ఇన్నోవేషన్‌లపై టి.ఐ.ఈ యొక్క దీర్ఘకాల దృష్టిని బలంగా ప్రతిబింబించింది.

హర్యానా చాప్టర్ ప్రారంభం, పర్సనల్ బోర్డ్ ప్రోగ్రామ్, టి.ఐ.ఈ క్రికెట్ లీగ్ (అక్టోబర్ 2025) వంటి పలు కొత్త కార్యక్రమాలను టి.ఐ.ఈ చండీగఢ్ అధ్యక్షుడు పూనీత్ వర్మా ప్రకటించారు. ఈ ఉత్సాహభరిత వేదిక తరువాతి అద్భుత ఘట్టానికి టి.ఐ.ఈ గ్లోబల్ సమ్మిట్ 2026 బాటలు వేసింది.

జైపూర్‌లో జనవరి 4 నుండి 6, 2026 వరకు జరగనున్న ఈ సమ్మిట్, రాజస్థాన్ డిజీఫెస్ట్‌తో కలిసి నిర్వహించబడుతుంది. ఇది టైర్2 నగరంలో జరుగుతున్న మొదటి టి.ఐ.ఈ గ్లోబల్ సమ్మిట్ అవుతుండటం విశేషం. ఈ వేడుకలో 30కి పైగా దేశాల నుంచి ఎంటర్‌ప్రెన్యూర్స్, ఇన్వెస్టర్లు, గ్లోబల్ స్పీకర్లు, 170 స్టార్టప్‌లు పాల్గొని తమ ఐడియాలు, ప్రాజెక్టులను ప్రదర్శించనున్నారు. టి.ఐ.ఈ గ్లోబల్ సమ్మిట్ 2026 థీమ్ “సస్టైనబుల్ ఇన్నోవేషన్ ఇన్ ది ఏఐ ఏజ్, ఇన్నోవేషన్, ఇంపాక్ట్ & ఇన్‌క్లూజన్” (ఏఐ యుగంలో స్థిరమైన ఆవిష్కరణ, ఆవిష్కరణ, ప్రభావం&సమావేశం)గా ప్రకటించబడింది. ఈ థీమ్ కృత్రిమ మేధస్సు (ఏఐ), ఫిన్‌టెక్, ఆగ్రిటెక్, సస్టైనబిలిటీ, ఏఐ/విఆర్, మీడియాటెక్, హయ్యర్ ఎడ్యుకేషన్ రంగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తుంది.

రాజస్థాన్ ప్రభుత్వం, టి.ఐ.ఈ తో కలిసి పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ రూపంలో ఈ ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. అధికారుల ప్రకారం, ఇది ప్రాంతీయ ఇన్నోవేషన్ సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపిస్తూ, గ్లోబల్ పెట్టుబడులను ఆకర్షిస్తుంది. “టైర్-2 సిటీలో మొదటిసారి టి.ఐ.ఈ గ్లోబల్ సమ్మిట్ జరగడం, రాజస్థాన్‌ను మెట్రో నగరాల మించి కొత్త ఇన్నోవేషన్ హబ్‌గా నిలబెడుతోంది,” అని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.

1992లో సిలికాన్ వ్యాలీలో స్థాపించబడిన టి.ఐ.ఈ , నేడు 16 దేశాల్లో 63 చాప్టర్లతో ప్రపంచ వ్యాప్తంగా వేలాది ఎంటర్‌ప్రెన్యూర్స్, మెంటర్లు, ఇన్వెస్టర్లను కలుపుతోంది. దాని లక్ష్యం స్పష్టమే, చిన్న నగరాల నుంచి ఎదుగుతున్న ఫౌండర్లకు మెంటార్‌షిప్, పెట్టుబడులు, గ్లోబల్ నెట్‌వర్క్‌లను అందించడం ద్వారా ‘ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెమోక్రటైజేషన్’ ను సాధించడం. జైపూర్ 2026 సమ్మిట్ 10,000 మంది అటెండీలు, 500 ఇన్వెస్టర్లు, 100 గ్లోబల్ స్పీకర్లతో రికార్డులు సృష్టించనుంది. ఇది భారత ఎంటర్‌ప్రెన్యూరియల్ కథనంలో కొత్త అధ్యాయం. మెట్రో, నాన్‌మెట్రో భారతాన్ని కలిపే ఇన్నోవేషన్ బ్రిడ్జ్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

యువత, మహిళా వ్యాపార అభివృద్ధికి టీ.ఐ.ఈ. గ్లోబల్ సమ్మిట్ - Tholi Paluku