
యాసంగి సీజన్ వచ్చినా.. రైతులకు తప్పని యూరియా తిప్పలు
సీజన్ మారినా కూడా రైతులకు యూరియా కొరత కష్టాలు తీరడం లేదు. వానాకాలంలో ఎదుర్కొన్న యూరియా కొరత సమస్యలు, ప్రస్తుతం యాసంగి సీజన్‌లో కూడా కొనసాగుతుండడంతో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితికి నిదర్శనంగా, జనగామ జిల్లాలోని పాలకుర్తి మండల కేంద్రంలో గ్రోమోర్ కేంద్రం ముందు రైతులు యూరియా కోసం గంటల తరబడి లైన్లలో వేచి ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది.
రైతులకు తప్పని యూరియా తిప్పలపై బీఆర్ఎస్ పార్టీ తన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.రైతులు చెప్పినట్లుగా, పంటలకు సమయానికి యూరియా అందకపోవడం వల్ల పంటల ఉత్పత్తి ప్రభావితం అవుతుందని. పాలకుర్తి మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాల వద్ద యూరియా కోసం రైతులు తెల్లవారుజాము నుంచే వచ్చి నిలబడాల్సి వస్తోందని. పొలాలకు ఎరువులు వేయాల్సిన అత్యవసర సమయంలో సరైన సమయానికి యూరియా లభించకపోవడంతో రైతులు తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని పంటల దిగుబడిపై ప్రభావం పడుతుందేమోనని తెలిపారు.
యూరియా కొరత సమస్య యాసంగిలోనూ కొనసాగడంపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పనితీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం సరైన సమయంలో యూరియా నిల్వలను అందుబాటులో ఉంచడంలో విఫలమైందని రైతులు, బీఆర్ఎస్ ఆరోపిస్తున్నాయి.యూరియా సరఫరాలో ఉన్న లోపాలను రైతులకు ఎదురవుతున్న ఈ అరిగోసను ప్రభుత్వం పరిగణించి, రైతులకు తక్షణమే న్యాయం చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది.ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్తే తప్ప, రైతన్నలకు న్యాయం జరగదు అని బీఆర్ఎస్ పేర్కొంది. ప్రభుత్వం వ్యవసాయ అవసరాలను తీర్చడంలో మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, లేనిపక్షంలో రైతులకు నిరంతరం కష్టాలు తప్పవని ఈ సందర్భంగా రైతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు.కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల ఆవేదనకు శ్రద్ధ చూపి, సరైన సమయానికి యూరియా అందించాల్సిన బాధ్యత ఉంది.
యూరియా కష్టాలకు ప్రధాన కారణాలు
సరఫరా లోపం, ఆలస్యం అవసరమైన సమయంలో యూరియా స్టాక్‌లు కేంద్రానికి చేరకపోవడం.ప్రభుత్వ వ్యవస్థలో సమన్వయ లోపం, పంపిణీ విధానంలో సక్రమ ప్రణాళిక లేకపోవడం.డిమాండ్‌కు సరిపడా అందుబాటు లేకపోవడం,ఈ కారణాల వల్ల రైతులకు సమయానికి ఎరువు అందక, పొలాల్లో పనులు నిలిచిపోతున్నాయి.
