Let's talk: editor@tmv.in
యాషెస్ సన్నాహాలకు హెడ్ చివరి రెండు టీ20లకు దూరం!

యాషెస్ సన్నాహాలకు హెడ్ చివరి రెండు టీ20లకు దూరం!

Koripelli Aditya
4 నవంబర్, 2025

ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో చివరి రెండు మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. నవంబర్ 21 నుంచి ప్రారంభం కానున్న యాషెస్ సిరీస్ సన్నాహాల్లో భాగంగా షెఫీల్డ్ షీల్డ్‌లో సౌత్ ఆస్ట్రేలియా తరపున ఆడనున్నాడు.

ముందు వెస్టిండీస్ పర్యటన తర్వాత మొదటిసారి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడబోతున్న 31 ఏళ్ల లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, వచ్చే వారం హోబార్ట్‌లో టాస్మానియాతో జరిగే పోరులో సౌత్ ఆస్ట్రేలియా జట్టులో కనిపించనున్నాడు. గత నెల రోజులుగా వైట్ బాల్ ఫార్మాట్‌లో హెడ్ బ్యాటింగ్ పెద్ద ఫామ్‌లో లేదు అనే చెప్పాలి. ఆగస్టులో సౌత్ ఆఫ్రికాపై 142 పరుగుల ఇన్నింగ్స్ తర్వాత ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో టాప్ స్కోరు కేవలం 31 మాత్రమే.

నంబర్ 5న ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో జరగబోయే ఆసీస్ బ్యాటింగ్ లైనప్‌కు ట్రావిస్ హెడ్ కీలకం కానున్నాడు. ఈ నాలుగు రోజుల మ్యాచ్ ఆడాలా వద్దా అనే నిర్ణయాన్ని పూర్తిగా హెడ్‌కే వదిలేశారని అంతర్గత వర్గాల సమాచారం.

హెడ్ తర్వాత ఆస్ట్రేలియా టీ20 జట్టును వీడిన తాజా ఆటగాడు జోష్ హెజిల్‌వుడ్. న్యూసౌత్ వేల్స్ బౌలింగ్ హెజిల్‌వుడ్ నడిపిస్తాడు. స్పిన్నర్ నాథన్ లయన్ కూడా జట్టులోనే ఉంటాడు. విక్టోరియాతో జరిగే మ్యాచ్‌లో ఇద్దరూ కలిసి ఆడనున్నారు.

హోబార్ట్ మ్యాచ్ ముగిసిన తర్వాత షాన్ అబాట్ న్యూసౌత్ వేల్స్‌కు అందుబాటులో ఉంటాడు. గబ్బాలో క్వీన్స్‌లాండ్‌పై 118 పరుగులు చేసిన స్టీవెన్ స్మిత్ రెండో మ్యాచ్‌లోనూ ఆడనున్నాడు. విక్టోరియా-టాస్మానియా మ్యాచ్‌కు రెస్ట్ ఇచ్చిన వెటరన్ పేసర్ స్కాట్ బోలాండ్ ఈ సీజన్‌లో మూడో షీల్డ్ మ్యాచ్‌కు సిద్ధమవుతున్నాడు. ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా తరపున క్వీన్స్‌లాండ్‌తో ఆడనున్నాడు. సీజన్ ఓపెనింగ్ మ్యాచ్ తర్వాత మొదటిసారి బౌలింగ్ బాధ్యతలు చేపట్టనున్నాడు.

ఇక భారత్ వైపు చూస్తే, చివరి రెండు టీ20 మ్యాచ్‌లకు ముందు లెఫ్ట్ హ్యాండ్ వ్రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను విడుదల చేసింది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో సౌత్ ఆఫ్రికా ఏతో జరిగే రెండో నాలుగు రోజుల టెస్ట్ కోసం ఇండియా ఏ జట్టులో చేరనున్నాడు.