
యాషెష్ లో మరో విజయం దిశగా ఆసీస్
యాషెష్ సీరిస్ లో దాదాపు రెండో టెస్ట్ పై కూడా ఆస్ట్రేలియా జట్టు పట్టు బిగించింది. విజయానికి మరో నాలుగు వికెట్ల దూరంలో ఉంది. రెండో టెస్ట్ లో ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లడ్ ను ఆరు వికెట్లతో కూల్చి అద్భుత ప్రదర్శన చేసిన మిచెల్ స్టార్క్, రెండో ఇన్నింగ్స్ లోనూ ఇప్పటికే రెండు వికెట్లు తీసి జోరు మీదున్నాడు. ఈ యాషెస్ సిరీస్‌లో మిచెల్ స్టార్క్ బంతితో ఇంగ్లండ్‌ను భయపెడుతున్నాడు. ఇప్పుడు బ్యాట్ తోనూ ఇబ్బంది పెడుతున్నాడు. రెండో టెస్టు మూడో రోజు స్టంప్స్ సమయానికి ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 134-6తో కోలుకోలేని స్థితిలో ఉంది. ఆస్ట్రేలియాను రెండో ఇన్నింగ్స్ కు దింపాలంటే ఇంకా 43 పరుగులు కావాలి.
పెర్త్‌లో జరిగిన మొదటి టెస్టులో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించగా, ఆ మ్యాచ్‌లో 10 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా స్టార్క్ నిలిచాడు.
ఇప్పుడు బ్రిస్బేన్‌లో జరుగుతున్న టెస్టులోనూ మరో అవార్డు ఆయనదే అవుతుందనిపిస్తోంది. మొదటి రోజు, రెండో రోజు ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్ (334)లో 6 వికెట్లు పడగొట్టిన స్టార్క్. శనివారం ఆస్ట్రేలియా జట్టు 511 పరుగులు చేసే క్రమంలో జట్టు అత్యధిక స్కోరు (77) నమోదు చేశాడు. తర్వాత రాత్రి సెషన్‌లో మళ్లీ రెండు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను కోలుకోలేని స్థితిలోకి నెట్టేశాడు. ఇంగ్లండ్ ఆశలన్నీ ఇప్పుడు కెప్టెన్ బెన్ స్టోక్స్ (4)పైనే ఆధారపడి ఉన్నాయి.
స్టార్క్ ఆధిపత్యం
35 ఏళ్ల స్టార్క్ శనివారం మధ్యాహ్నం ఇంగ్లండ్ బౌలర్లు చెమటలు చిందించేలా బ్యాటింగ్ చేశాడు. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 177 పరుగుల ఆధిక్యం సాధించే క్రమంలో కీలక పాత్ర పోషించాడు. రాత్రి లైట్స్ ఆన్ అయి, పింక్ బాల్ కొంచెం స్వింగ్ అవుతుంటే... ప్రపంచ నంబర్-1 బ్యాటర్ జో రూట్ (15) వికెట్‌ను స్టార్క్ క్లెయిమ్ చేశాడు. అప్పుడు ఇంగ్లండ్ స్కోరు 123-5. ఇంకా 54 పరుగుల వెనుకబడి ఉంది. తర్వాత ఓవర్‌లోనే జామీ స్మిత్ వికెట్ తీసి 128-6కి పరిస్థితిని మరింత దిగజార్చాడు.
సిరీస్‌లో తొలిసారి స్టార్క్ ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లో వికెట్ తీయలేదు. ఆ పని స్కాట్ బోలాండ్, మైకేల్ నెసర్ చేశారు. బోలాండ్ బెన్ డకెట్ (15), హ్యారీ బ్రూక్ (15)లను ఔట్ చేయగా... నెసర్ రెండు అద్భుతమైన రిటర్న్ క్యాచ్‌లతో ఓలీ పోప్ (26), జాక్ క్రాలీ (44)లను పెవిలియన్ పంపాడు. స్టార్క్ ఎప్పుడూ అంగీకరించడు కానీ... ఆయనే అత్యుత్తమ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్, ఎప్పుడూ అని నెసర్ పొగడ్తలతో ముంచెత్తాడు. బంతితోనో, బ్యాట్‌తోనో... ఆయన పక్కన ఉండి చూడటమే అదృష్టం అని కూడా అన్నాడు. ఆదివారం(నేడు) త్వరగా నాలుగు వికెట్లు తీస్తే ఆస్ట్రేలియా 2-0 ఆధిక్యంలోకి వెళ్తుంది.
అరుదైన రికార్డు
టెస్టు క్రికెట్ చరిత్రలో దాదాపు 150 ఏళ్లలో కేవలం మూడోసారే... ఒక ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 11 మంది బ్యాటర్లంతా డబుల్ ఫిగర్స్ (10 లేదా అంతకంటే ఎక్కువ) చేరారు. స్టార్క్ 77తో పాటు జేక్ వెదరాల్డ్ (72), మార్నస్ లబుషేన్ (65), స్టీవ్ స్మిత్ (61), అలెక్స్ కారీ (63) హాఫ్ సెంచరీలు సాధించారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్ 29 ఓవర్లు వేసి 152 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. కెప్టెన్ స్టోక్స్ 24 ఓవర్లు 113 ఇచ్చి 3, గస్ అట్కిన్సన్ 28 ఓవర్లు 114 ఇచ్చి 1 వికెట్, జోఫ్రా ఆర్చర్ 87కి 1, ఒక్క స్పిన్నర్ జాక్స్ 34కి 1 వికెట్ తీశారు.
‘చాలా కష్టమైన రోజు. మేం చాలా చెత్తగా ఆడాం’ అని ఇంగ్లండ్ అసిస్టెంట్ కోచ్ మార్కస్ ట్రెస్కోథిక్ అన్నాడు. రేపు తిరిగి మ్యాచ్‌పై ప్రభావం చూపాలి అని ఆశాభావం వ్యక్తం చేశాడు.
